ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను తెలంగాణ సీఎం కేసీఆరే.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా పది మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసినప్పటికీ.. ఎవరికీ ఆర్థిక శాఖ కేటాయించలేదు. గత మంత్రి వర్గంలో ఆర్థిక శాఖ నిర్వహించిన ఈటల రాజేందర్‌కు వైద్య, ఆరోగ్యశాఖ కేటాయించారు. మిగిలిన తొమ్మిది మంది మంత్రులకు… శాఖల కేటాయింపుల్లోనూ పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. జగదీష్‌రెడ్డికి విద్యాశాఖ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పశుసంవర్ధక శాఖ, ఇంద్రకరణ్రెడ్డికు దేవాదాయ, అటవీ, న్యాయశాఖ, వేముల ప్రశాంత్‌రెడ్డికి రవాణా, రోడ్లు భవనాల శాఖ , నిరంజన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ, కొప్పుల ఈశ్వర్ కి సంక్షేమ శాఖ, చామకూర మల్లారెడ్డికి కార్మికశాఖ, శ్రీనివాస్ గౌడ్ కి ఎక్సైజ్, టూరిజం, క్రీడలు, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు.
అత్యంత కీలకమైన శాఖలన్నీ తన దగ్గరే ఉంచుకున్నారు. ఆర్థికశాఖ, ఇరిగేషన్, ఐటీ, మున్సిపల్ శాఖలు కేసీఆర్ వద్దనే ఉన్నాయి. గతంలో ఐటీ , మున్సిపల్ శాఖలను కేటీఆర్, ఇరిగేషన్ ను.. హరీష్ రావు నిర్వహించారు. ఆ శాఖలను తన వద్దే అట్టి పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరగనున్న విస్తరలో ఈ శాఖలను కేటాయించే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై పూర్తి స్థాయి కసరత్తును… కేసీఆరే చేశారు. ఆయనే బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. ఇది ఓ రికార్డుగా నిలువనుంది.
మంత్రివర్గ శాఖ ల పునరేకీకరణ జరుగుతుందని.. అందుకే మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం అవుతోందని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పటి వరకూ చెప్పుకొచ్చాయి. కానీ.. అలాంటి ఏకీకరణ ఏమీ… జరగలేదు అన్ని శాఖలు అలాగే ఉన్నాయి. తక్కువ మంది మంత్రులు ఉన్నారు కాబట్టి.. పెద్దగా పని లేని శాఖలను.. ఎక్కువగా మంత్రులకు కేటాయించారు.