గుడ్లవల్లేరు కాలేజీ చుట్టూ ఓ రాజకీయ వల వేసి కొన్ని వందల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని స్పష్టమయింది. సుదీర్ఘ పరిశోధన తర్వాత గుడ్ల వల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఎక్కడా కెమెరాలు లేవని.. వీడియోలు బయటకు రాలేదని విద్యామంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ఒక్క హిడెన్ కెమెరా కూడా పట్టుబడలేదన్నారు. నలుగురు విద్యార్తుల మధ్య తలెత్తెన్న వివాదాన్ని పట్టుకొని కొందరు రచ్చ చేస్తున్నారుని.. విద్యార్థులు ఎక్కడ హిడెన్ కెమెరాలను చూపించలేకపోయారని స్పష్టంచేశారు.
కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేసి సెన్సేషన్ సృష్టిస్తున్నారని.. విద్యాశాఖ మంత్రిగా నేను ఉన్నాను కాబట్టే ఇంకా ఎక్కువ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వాస్తవాలు తెలుసుకొని మీడియాలో ప్రచురించాలన్నారు. ఏదైనా కాలేజీలో విద్యార్థుల అసభ్య వీడియో పది సెకన్లు బయటకు వస్తే ఎంత వైరల్ అవుతుదో చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ వందల వీడియోలు.. హిడెన్ కెమెరాలు అంటారు కానీ ఒక్క వీడియో కూడా లేదు. అందరూ వారు చెప్పారని.. వీరు చెప్పారని.. పుకార్లు సృష్టించుకున్నారు. ఇందులో రాజకీయం చొరబడటంతో విద్యార్థుల భవిష్యత్ పై పెను ప్రభావం చూపించనుంది.
ఇప్పుడీ కాలేజీలో చదువుకునే విద్యార్థినులకు జీవితాంతం ఈ ఘటన వెంటాడుతుంది. రహస్య వీడియోలు బయటకు వచ్చాయంట కదా అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. ఇలాంటి సమస్య వస్తుందని తెలిసి తెలియక విద్యార్థినులుఎవరో రెచ్చగొడితే … ఫేక్ న్యూస్ మీద రాజకీయ ఉచ్చులో చిక్కుకున్నారు ఇప్పుడు రాజకీయం చేయగలిగిన వాళ్లు చేసుకున్నారు. మరి విద్యార్థుల భవిష్యత్ మాటేమిటి ?