మా అవసరం ఉంటేనే బీజేపీకి రాజ్యసభ అవసరాలు తీరుతాయని..తమ డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి ఇంత కంటే పెద్ద చాన్స్ లేదని .. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగిన వైసీపీకి మైండ్ బ్లాంక్ అయ్యే పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చేయడం ఖాయమయింది.
రాజ్యసభలో మొత్తం సీట్లు 245, ఇందులో జమ్మూకశ్మీర్ కి సంబంధించి అసెంబ్లీలు లేకపోవడంతో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి . ప్రస్తుతం పన్నెండు స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పన్నెండు కాకుండా 229 మందిలో ఎన్డీఏ పార్టీలకు 105 మంది సభ్యులు ఉన్నారు. మరో ఆరుగురు నామినేటెడ్ సభ్యులు కూడా బీజేపీకే మద్దతిస్తారు. అంటే 111 మంది. ఉపఎన్నికలు జరుగుతున్న 12 రాజ్యసభ స్థానాల్లో 11 బీజేపీ , మిత్రపక్షాల ఖాతాల్లో ఏకగ్రీవంగా పడనున్నాయి అంటే 122 మంది సభ్యుల బలం ఉన్నట్లే.
ప్రస్తుతం 241 సీట్ల రాజ్యసభలో 122 మంది సభ్యులు అంటే.. సాధారణ మెజార్టీ వచ్చినట్లే. వైసీపీ, బీజేడీ మద్దతు బీజేపీకి అక్కర్లేదు. పదకొండు మంది రాజ్యసభ సభ సభ్యులు ఉన్న వైసీపీ.. బీజేపీని బ్లాక్ మెయిల్ చేసేందుకు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించింది. ఆ బిల్లును రాజ్యసభకు వచ్చినప్పుడు వైసీపీ వ్యతిరేకిస్తే.. అప్పుడు అసలు సినిమా ప్రారంభమవుతుంది. కానీ అంత ధైర్యం చేస్తారా అన్నదే కీలకం.