మరో నాలుగు రోజుల్లో `ఇస్మార్ట్ శంకర్` విడుదల కాబోతోంది. ప్రమోషన్లు హై పిచ్‌లో జరగాల్సిన సమయం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ ఫారెన్ చెక్కేశాడు. మరో నెల రోజుల పాటు తన మకాం అక్కడే. కీలకమైన సమయంలో రామ్ ప్రమోషన్లకు దూరం అవ్వడం `ఇస్మార్ట్ శంకర్` స్పీడుకి బ్రేకులు వేసినట్టైంది. అయితే ముందుగా నిర్ణయించుకున్న ప్లాన్ ప్రకారమే రామ్ విదేశాలకు వెళ్లాల్సివస్తోంది. నిజానికి వేసవిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. కానీ వీసా సమస్యలు రావడంతో షూటింగ్లో ఇబ్బందులు తలెత్తాయి. దాంతో… చిత్రీకరణ ఆలస్యమై, విడుదల వాయిదా పడింది. ఫారెన్ టూర్ ముందుగా ప్లాన్ చేసుకోవడం వల్ల రామ్ ఇప్పుడు విమానం ఎక్కేశాడు. దాంతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూలకు, విడుదలకు ముందు చేసే ప్రచారానికి రామ్ అందుబాటులో లేకుండా పోయాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రచారం భుజాలనెత్తుకునే బాధ్యత పూర్తిగా పూరి, ఛార్మిలపై పడిపోయింది.