హైదరాబాద్లోని రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు మళ్లీ వెళ్లారు. నలుగురు అధికారుల బృదం ఆయన ఇంటికి వచ్చింది. గురువారం విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో నమోదైన కేసు విషయంలోనే ఈ నోటీసులు రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి రఘురామకృష్ణరాజు గురు, శుక్రవారాల్లో భీమవరంలో పండుగ చేసుకోవడానికి వస్తున్నట్లుగా ప్రకటించారు. రెండురోజుల పాటు ఉంటానని.. ఆయన ప్రకటించారు.
అయితే ఆయనకు పండుగ సంబరాలకు చాన్స్ లేకుండా విచారణ పేరుతో సీఐడీ ఆఫీసులో కూర్చోబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా రఘురామ వర్గీయులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే రఘురామకృష్ణరాజు తన రెండు రోజుల ఏపీ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. తన ప్రతి కదలికపై తానే కెమెరా నిఘా పెట్టుకుంటున్నారు. తప్పుడు కేసులు పెట్టకుండా సాక్ష్యాలు ఉంచుకుంటున్నారు.
ఈ క్రమంలో సీఐడీ అధికారులు విచారణకు రాాలని నోటీసులు జారీ చేయడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఓ సారి ఏ కేసు పెట్టారో తెలియకుండానే ఆయన పుట్టిన రోజునాడు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోయారు. ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరోసారి సీఐడీ రఘురామపై గురి పెట్టడం ఆసక్తికరంగా మారింది.