‘ఛల్ మోహన్ రంగ’ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త కలవరపాటుకు గురి కావడం ఖాయం. ఎన్టీఆర్‌కీ – ఛల్ మోహన రంగకీ సంబంధం లేదు. ఉన్న లింకల్లా… త్రివిక్రమ్ మాత్రమే. ఈ సినిమాకి త్రివిక్రమ్ కథ అందించాడు. కథలో బలహీనతే.. ఈ సినిమాని దెబ్బ కొట్టేసిందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఆ కథ రాసుకునే అవకాశం కూడా కృష్ణ చైతన్య కే వదిలేస్తే బాగుండేది కదా? అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. కథా రచయితగా త్రివిక్రమ్ ఫెయిల్ అయ్యాడన్నది మొహమాటం లేకుండా చెప్పేయొచ్చు. అజ్ఞాతవాసి ని కూడా బలహీనమైన కథే దెబ్బకొట్టింది. అలాంటప్పుడు ఎన్టీఆర్ సినిమాకి ఎలాంటి కథ ఇచ్చాడో… అనేది సగటు ఎన్టీఆర్ అభిమాని ఆందోళన.
అయితే త్రివిక్రమ్ కథలేం గొప్పగా ఉండవు. ఆయన ఆల్ టైమ్ సూపర్ హిట్ అత్తారింటికి దారేది కూడా సగటు కథే. అ.ఆ ఓ నవల ఆధారంగా తీసిన సినిమా. అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలు రాసుకోవడం త్రివిక్రమ్‌కి రాదు. తన మాటల మ్యాజిక్‌తో, ఎమోషన్‌తో గట్టెక్కించేశాడు అన్ని సార్లు. సో.. త్రివిక్రమ్ నుంచి కథల విషయంలో వింతలూ, విడ్డూరాలూ ఆశించడం భావ్యం కాదు. కాకపోతే.. ఎన్టీఆర్ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తన కెరీర్లోనే తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు తారక్. ఈ సమయంలో ఫ్లాప్ పడితే… ఆ టెంపో దెబ్బతింటుంది. త్రివిక్రమ్ మాత్రం చాలా డౌన్లో ఉన్నాడు. తనకు ఫ్లాప్ పడితే.. అగ్ర దర్శకుల జాబితాలోంచి పేరు.. ఇంకాస్త కిందకి జారుతుంది. అందుకే కథ విషయంలో త్రివిక్రమ్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.