ఇది ఇటు అభిమానులకు అటు మా టీవీ కి కూడా కాస్త షాకింగ్ గానే వుంటుంది. ఎందుకంటే మాటీవీ సూపర్ హిట్ షో బిగ్ బాస్ సీజన్ మూడు ను ఎన్టీఆర్ హోస్ట్ చేస్తారని ఇప్పటికే వార్తలు వినవచ్చాయి. అభిమానులు అదే ఆనందంతో వున్నారు. తరచు ఎన్టీఆర్ ను, తెరపై చూడొచ్చు అని అనుకున్నారు. మాటీవీ యాజమాన్యం ఇరవై కోట్లకు పైగానే పారితోషికం ఆఫర్ చేసి, ఎన్టీఆర్ నుంచి అవును అనిపించుకుంది అని గ్యాసిప్ లు వచ్చాయి.
అప్పటికీ అభిమానులకు అనుమానంగానే వుంది. ఆర్ఆర్ఆర్ సినిమా షూట్ లో బిజీగా వుంటూ నెల రోజులు ఎన్టీఆర్ ఇటు దృష్టి పెట్టగలడా? అని. కానీ రాజమౌళి-ఎన్టీఆర్ మాంచి మిత్రులు కదా, పాజిబుల్ అనుకున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే బిగ్ బాస్ షో ను ఎన్టీఆర్ చేసే అవకాశాలు లేవని. దాంతో మాటీవీ నిర్వాహకులు డైలామాలో పడ్డారని.
200 వర్కింగ్ డేస్ కాల్ షీట్ లు కావాలంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు. ఇప్పటికి గట్టిగా పాతిక కూడా కాలేదు. ఇంకా 175 వర్కింగ్ డేస్ పనిచేయాలి. ఈనేపథ్యంలో బిగ్ బాస్ షో చేయడం కుదరదని భావిస్తున్నారట. ఈ విషయం ఇప్పటికే మాటీవీ జనాలకు చెప్పారని, కానీ వాళ్లు ఎలాగైనా ఎన్టీఆర్ కన్విన్స్ చేసే పనిలో వున్నారని వినికిడి.
ఎన్టీఆర్ కాకపోతే నానిని ట్రయ్ చేసారు. కానీ రిజల్ట్ ఎలా వున్నా, జనాల నుంచి రియాక్షన్ అయితే అంతంత మాత్రమే. అందుకే ఎలాగైనా మళ్లీ మరొకళ్లని ట్రయి్ చేసి, రిజల్ట్ కోసం ఇబ్బందిపడే బదులు ఎన్టీఆర్ నే పట్టుకోవాలని చూస్తున్నారని టాక్. కానీ అది సాధ్యం కాదన్నది ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర నుంచి వస్తున్న సమాచారం.