ఆస్కార్ అవార్డ్ గెల్చుకున్న తర్వాత ఎన్టీఆర్ తొలి పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్నారు. విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డ్ గురించి ప్రస్థావించారు. ఈ అవార్డు రావడానికి కారణం అభిమానులు ప్రేక్షకులని చెప్పారు. ఆస్కార్ వేదిక తెలుగుదనంతో ఒట్టిపడిందని, ఇలాంటి వేడుక మళ్ళీ చూస్తామని ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా వుంది.
”ఈ చిత్రానికి పని చేసిన మేము కాదు మా అందరితో పాటు మీరు ఆస్కార్ ని సాధించారు. మీ అందరి బదులు మేము అక్కడ నిలుచున్నాం. మా అందరికి బదులు కీరవాణి గారు బోస్ గారు నిలిచున్నారు. వారిద్దరిని అక్కడ చూస్తుంటే ఇద్దరు భారతీయలు కనిపించారు. ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపించారు. వేదిక తెలుగుదనంతో ఒట్టిపడింది. ఈ రెండు కళ్ళతో ఆ దృశ్యం చూడటం ఒక పండగలా అనిపించింది. ఇలాంటి పండగని మళ్ళీ పొందుతాం. ఆర్ఆర్ఆర్ ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ఇంకా ముందుకు వెళుతుంది ” అన్నారు తారక్