యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా నాన్నకు ప్రేమతో.. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ నెల 13న సంక్రాంతి బరిలో దిగనుంది. ఇన్నాళ్లు పరోక్షంగా పోటీ పడ్డ బాలయ్య, ఎన్.టి.ఆర్ లు ఈసారి ప్రత్యక్షంగా యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో ఎవరికి వారు తగ్గే ప్రసక్తే లేదని తెలుస్తుంది. ఇక సినిమాను మరింత ప్రేక్షకుల్లో తీసుకెళ్లే ప్రయత్నంతో ఎన్.టి.ఆర్ తన సినిమాలకు ఎప్పుడు చేయని విధంగా ప్రమోట్ చేస్తున్నాడు.
ఆ క్రమంలోనే మీడియాకు పార్టీ ఇచ్చినట్టు సమాచారం. సినిమా ప్రేక్షకులకు దగ్గర చేసే క్రమంలో మీడియా చాలా సహరిస్తుందని భావించి ఎన్నడు లేని విధంగా మీడియా వారికి ఓ విందు ఇచ్చాడట ఎన్.టి.ఆర్. ఈ పార్టీ హంగామా చూస్తుంటే డిక్టేటర్ కు పోటీగా వస్తూ మీడియా వారిని ఆకర్షించే విధానం చూస్తుంటే జూనియర్ బాబు మంచి ప్లాన్ లోనే ఉన్నాడని తెలుస్తుంది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాన్నకు ప్రేమతో సినిమా శ్రీ వెంకటేశ్వర సిని క్రియేషన్స్ బ్యానర్లో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.