హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి దర్శకుడు ఖరారయ్యారు. మిర్చి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసి ప్రస్తుతం మహేష్‌తో శ్రీమంతుడు చిత్రాన్ని తీస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. దిల్ రాజు నిర్మాత. 2016 జనవరిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని రాజు ఇవాళ వెల్లడించారు. రాజు గతంలో ఎన్టీఆర్‌తో బృందావనం, రామయ్యా వస్తావయ్యా చిత్రాలను నిర్మించారు. వాస్తవానికి మిర్చి తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్తోనే చేయటానికి కథ సిద్ధం చేసినప్పటికీ అది ఆయనకు నచ్చకపోవటంతో ఆ ప్రాజెక్టు పట్టాలపైకి ఎక్కలేదు.
ఎన్టీఆర్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది.