బిగ్ బాస్ 2 సీజన్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నూతన్ నాయుడు ఈరోజు లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించే సమయంలో ఆయన పక్కన కూర్చుని అటు మీడియా కి, ఇటు జనాల కి షాక్ ఇచ్చారు.
బిగ్ బాస్ 2 సీజన్ సమయంలో సామాన్యుడిగా ఆ కార్యక్రమం లోకి ప్రవేశించిన నూతన్ నాయుడు, మొదట్లోనే షో నుండి నిష్క్రమించినప్పటికీ, మళ్లీ రీ ఎంట్రీ ద్వారా షో లో ప్రవేశించడం తెలిసిందే. అలాగే అప్పట్లో తనకు రాజకీయ ఆసక్తి ఉన్న విషయం కూడా ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. 2009 ప్రజారాజ్యం సమయంలో , ఆ తర్వాత 2014 జై సమైక్యాంధ్ర పార్టీ సమయంలో రాజకీయ పార్టీల వ్యవహారాలలో తాను కీలకంగా వ్యవహరించారని తెలిపిన నూతన్ నాయుడు, బిగ్ బాస్ తర్వాత F2 సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
మరి ఇప్పుడు లగడపాటి పక్కన కూర్చుని కనిపించడం తో ఈయన కూడా లగడపాటికి చెందిన అర్జీ ఫ్లాష్ టీం లో ఏమైనా పని చేశాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.