ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పరిస్థితి చూసి తెలంగాణ ఉద్యోగులు జాలి పడాల్సి వస్తోంది. పొరుగు రాష్ట్ర ఉద్యోగులకు ఠంచన్ గా డీఏలు, బకాయిలు చెల్లిస్తూంటే… ఏపీలో మాత్రం ఏమీ చేయకుండానే పాలాభిషేకాలు చేయాల్సి వస్తోంది. చేయకపోతే ఎక్కడ కేసులు పెట్టి లోపలేస్తారోనని భయపడుతున్నారు. ఇప్పటికే ఉద్యోగుల కోసం పోరాడిన సూర్యనారాయణ అనే ఉద్యోగ సంఘం నేత పరారీలో ఉన్నారు. ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చే చాన్స్ లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం చెబుతోంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు చేసిన బదిలీల సిఫార్సు లేఖలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో మిగతా వారంతా సైలెంట్ అయిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగులకు రెండు శాతానికిపైగా డీఎ ప్రకటించింది. దీంతో మొత్తం కరువు భత్యం ఇరవై శాతానికి దాటిపోయింది. ఏపీ ఉద్యోగులకు మాత్రం డీఏలు అడిగే ధైర్యం కూడా లేకుండాపోయింది. గతంలో ఆరేడు డీఏలు పెండింగ్లో ఉంటే.. పీఆర్సీతో కలిపి మ్యాజిక్ చేశారు. పీఆర్సీ తగ్గిచి… పెండింగ్ డీఏలన్నీ మంజూరు చేశామని లెక్కల్లో కథలు చెప్పారు. దీంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ డీఏలు అడుగుతూంటే ప్రకటనలు మాత్రం వస్తున్నాయి.. మంజూరు మాత్రం కావడంలేదు.
ఇప్పటికీ ఉద్యోగ సంఘం నేతలు… ప్రభుత్వానికే అనుకూలంగా ఉంటున్నారు తమ సంక్షేమం కోసం పోరాడామని నేతలుగా ఎన్నుకుంటే.. వారు ఇలా స్వార్థంతో … ప్రభుత్వానికి బాకా ఊదడంతో.. తాము మోసపోతున్నామని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అంతకు మించి వారు చేయడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణలో 43 శాతం జీతాలు పెంచితే… ఏపీ ఉద్యోగులు నష్టపోకూడదని అంత శాతం పెంచారు చంద్రబాబు. కానీ ఇప్పుడు… తెలంగాణ ఉద్యోగులకు ఠంచన్ గా పీఆర్సీ, డీఏలు అందుతున్నాయి… వారి జీతం భారీగా పెరిగింది. కానీ.. ఏపీ ఉద్యోగుల జీతం మాత్రం అలాగే ఉంది.