సీఎం జగన్ రెడ్డి కులం చూడరు, మతం చూడరు. ఏ ఇతర వర్గాలూ ఆయనకు కనిపించవు. కేవలం రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు మాత్రమే కనిపిస్తారు. అందులోనూ తమ కుటుంబానికి దగ్గరైన రెడ్డి వర్గం వారు మాత్రమే కనిపిస్తున్నారు. దానికి తాజాగా ఉదాహరణ ఇద్దరు రాష్ట్ర అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎస్‌గా గుర్తింపు ఇప్పించడం.
డాక్టర్ నీలకంఠా రెడ్డి, బొమ్మినేని అనిల్ కుమార్ రెడ్డిలు ఇద్దరికి IAS లుగా ప్రమోషన్ ఇస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారి చేసింది. అదేంటి ఏపీలో ఇంక ఎవరూ లేరా… ఇద్దరే ఉన్నారా… అని చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ అందరికీ అన్యాయం చేసి వీరిద్దరికి మాత్రమ కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా ప్రమోషన్ ఇప్పించడానికి ప్రభుత్వం మొత్తం అత్యున్నత స్థాయిలో ప్రయత్నించింది. సాధారణంగా రెవిన్యూలో పని చేసేవారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరూ కుల బాంధవులు .. రెవిన్యూలో పన ిచేయరు. ఒకరు సీఎం జగన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా వ్యవహరించే ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ్ రెడ్డికి లెఫ్ట్ హ్యాండ్ కాగా.. మరొకరు… పులివెందులను మెట్రో చేసేస్తామని బిల్డప్ ఇచ్చి పెట్టిన కార్పొరేషన్ కు హెడ్. వీరి సర్వీస్ ఐఏఎస్ స్థాయిలో లేదు. కానీ తమ వారు కాబట్టి… వడ్డించే శారు.
ప్రతి గ్రూప్ వన్ ఆఫీసర్ కు.. కన్ ఫర్డ్ ఐఏఎస్ గా గుర్తింపు పొందాలని ఆశ ఉంటుంది. అందు కోసం కష్టపడతారు. ప్రతి ప్రభుత్వం… ప్రతిభకే పట్టం కడుతుంది. ఎవరు బాగా పని చేస్తే వారికే చాన్స్ ఇస్తుంది. అయితే ఈ ప్రభుత్వం ప్రయారిటీలు వేరు. అందుకే కష్టపడి పని చేసేవారందిరకీ మొండిచేయి చూపి.. రెడ్డి వర్గం ఆఫీసర్లకే పెద్ద పీట వేస్తోంది.
ఇప్పటికే ఏపీలో అసలైన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల ను వాడుకోవడం లేదు. సలహాదారులు.. ఇతర చోట్ల నుంచి వచ్చిన వారిని పెట్టుకుని కథ నడిపిస్తున్నారు.
రాష్ట్రంలో ఏ అంశంపై ఎవరు స్పందించాలనుకున్నా… మాట్లాడే అధికారి పేరు చివరి ఖచ్చితంగా రెడ్డి ఉంటుంది. సాక్షి లాంటి పత్రికలు ఆ రెడ్డి పేరు రాయడానికి సిగ్గుపడతాయి. ఉదాహరణకు రాజమండ్రి జైలను పర్యవేక్షించే అధికారి పేరు రవికిరణ్ రెడ్డి అయితే రవికిరణ్ అని రాస్తుంది. అంతగా సాక్షినే సిగ్గుపడేలా రెడ్లను నియమిస్తున్నారని.. నియమించుకునేవాళ్లూ సిగ్గుపడటం లేదు.