ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై అంతులేని వ్యతిరేకత పెంచుకున్న బీజేపీయేతర పార్టీలు.. బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌ను ఢిల్లీ స్థాయిలో ఆఖరి సారిగా వినిపించాలని నిర్ణయించుకున్నాయి. పార్లమెంట్ సమావేశాల కోసం అందరూ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉండటంతో… ఫిబ్రవరి ఒకటో తేదీన.. దీనికి ముహుర్తంగా ఎంచుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అందర్నీ సమన్వయం చేసుకున్నారు. ఈవీఎంలపై పోరాటం చేయాలని.. బ్యాలెట్ కోసం పట్టుబట్టాలని కోల్‌కతాలో.. జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు.. చంద్రబాబు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈవీఎంల పనితీరుపై వివిధ పార్టీల నేతలతో మంతనాలు జరిపారు. ఈవీఎంలు వద్దంటూ ముందుగా ఫిబ్రవరి 1న ఈసీని కలుస్తారు. అక్కడ స్పందనా ఎలాగూ నిరుత్సాహ పూరితంగా ఉంటుంది కాబట్టి.. రాష్ట్రపతిని కూడా కలవాలని నిర్ణయించారు.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. పార్లమెంట్ వ్యూహంతో పాటు… రాజకీయ ఐక్యత పై.. చర్చించేందుకు ఫిబ్రవరి 1న ఢిల్లీలో సమావేశం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలపై చర్చలు జరుపుతారు. కోల్‌కతా తరహా సభల నిర్వహణపై సమీక్ష చేస్తారు. ఇప్పటికే కేంద్రానికి వ్యతిరేకంగా సభలు నిర్వహించేందుకు టీడీపీ, జేడీఎస్, ఆప్, డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు ముందుకొచ్చాయి. 10 రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీల తరపున సభలు పెట్టాలని ఇప్పటికే నిర్మయించారు. దీనిపై.. ముందుగా ఎవరు పెట్టాలన్నదానిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
ప్రతిపక్ష నేతల పోరాటాల వల్ల… బ్యాలెట్ వచ్చే అవకాశం ఒక్క శాతం కూడా లేదు. నిజానికి.. ఒక్క బీజేపీ మినహా.. మెజార్టీ పార్టీలు..ఈవీఎంని వ్యతిరేకిస్తున్నాయి. బ్యాలెట్‌ని కోరుతున్నాయి. నమ్మకం మీదేనే.. ప్రజాస్వామ్యం ఆధారపడినప్పుడు… సహజంగా మెజార్టీ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ..ఇప్పుడు… బీజేపీ మాత్రం..ఈవీఎంలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఈసీ కూడా అంతే ఉంది. ఒక వేళ.. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి… బీజేపీయేతర పార్టీలు అధికారంలోకి వస్తే.. అప్పుడు అవి తమ విధానాన్ని మార్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఏదో ఓ సందర్భంలో పార్టీలన్నీ.. ఈవీఎంలను వ్యతిరేకించాయి బీజేపీ సహా. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా.. ఈ అభిప్రాయాలు ఉండటంతోనే సమస్యలు వస్తున్నాయి.