ఆస్కార్ అందుకున్న గీత రచయిత చంద్రబోస్ తన ప్రయాణంలో తోడైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తొలి పాట రాయడానికి సహకరించిన వారిని, తోడుగా నిలిచిన వారిని, ఇలా అందరినీ కలసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పుడు పుట్టిన ఊరుకి కూడా తనవంతుగా సేవ చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో పుట్టారు చంద్రబోస్. ఊర్లో ఆయన ఇంటి పక్కనే గ్రంధాలయం ఉంది. బాల సాహిత్యం అక్కడే చదివారు. ఆ గ్రంథాలయం ఇప్పుడు శిధిలావస్థలో ఉంది. కొత్తగా దాన్ని నిర్మించి, దానికి ఆస్కార్ గ్రంథాలయం అనే పేరు పెట్టాలనేది చంద్రబోస్ ఆలోచన. ఈ గ్రంధాలాయం పునర్ నిర్మాణానికి సంబధించిన పనులు త్వరలోనే మొదలుకానున్నాయి.