పల్నాడులో టీడీపీ కార్యకర్తలు చూపించిన పోరాట పటిమ అన్ని పార్టీల నేతల్ని అబ్బుర పరుస్తోంది. ప్రాణాలకు తెగించి పోరాడే ఆ ధైర్యం వల్లనే టీడీపీ పునాదులు ఎవరూ పెకిలించలేనంతగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లోల పల్నాడులో జరగని దౌర్జన్యం లేదు. చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తని గ్రామ నడిబొడ్డులో పట్టుకుని పీక కోసి చంపేశారు వైసీపీ నేతలు. ఆ దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఒళ్ల గగుర్పొడుస్తాయి. భయపడిపోతారు. టీడీపీ నేతలు , కార్యకర్తలు బాధపడ్డారు కానీ భయపడలేదు.
మాచర్లతో పాటు గురజాల, నర్సరావు నియోజకవర్గాల్లో ఐదేళ్లలో కొన్ని వందల మంది టీడీపీ కార్యకర్తలు వేధింపులకు గురయ్యారు. ఇంకా ఎన్నో వేల మంది ఊళ్లు వదిలి పరారు కావాల్సి వచ్చింది. కానీ ఎవరూ భ యపడలేదు. మళ్లీ ఎన్నికల నాటికి తాము భయపడే ప్రశ్నే లేదని పార్టీ కోసం పని చేయడానికి వచ్చారు. మాచర్లలో కనీసం సర్పంచ్ స్థానానికి పోటీ చేయలేని పరిస్థితులు పిన్నెల్లి సృష్టించారు. ఎదిరిస్తే అంతమేనన్నట్లుగా ఉన్నా.. పోలింగ్ సమయంలో ఎవరూ తగ్గలేదు. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపైకి టీడీపీ బూత్ ఏజెంట్ ధైర్యం వెళ్లడమే నిదర్శనం.
పల్నాడులో అరాచకాలు, వేధింపులు టీడీపీ కార్యకర్తల ధైర్యాన్ని నిరూపించలేవని స్పష్టమయింది. పల్నాడు రావణకాష్టం కాకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు తాము అధికారంలో ఉన్నా వేధింపులు, హత్యల వైపు వెళ్లే ఎవర్నీ ప్రోత్సహరించలేదు. కానీ ఈ ఐదేళ్లలో జరిగిన పరిణామాలతో ఖచ్చితంగా క్యాడర్ ను సంతృప్తి పరిచేలా మారాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.