వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరిగిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎట్టకేలకు స్పందించారు. తన నియోజకవర్గంలోని క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశం అయిన ఆయన.. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను పార్టీ మారబోవడం లేదని.. పార్టీ మార్పు వార్తలన్నీ దుష్ప్రచారం అని ఖండించారు. పార్టీ మార్పుపై ఎవరితోనూ చర్చించలేదని.. స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రకటించారు. శనివారం ఆయన తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్టుతో.. ఆయన పార్టీ మార్పు ఖాయమని అందరూ అనుకున్నారు.
తనపై వస్తున్న వార్తల విషయంలో అందులో ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా.. నియోజకవర్గ అభిృవృద్ధి గురించి ప్రస్తావించారు.. అభివృద్ధి కోసమే తాను ఓ నిర్ణం తీసుకోబోతున్న అర్థం వచ్చేటట్టు పోస్ట్ చేశారు. అయితే.. కార్యకర్తలతో సమావేశం సమాయానికి ఆయన టోన్ పూర్తిగా మారిపోయింది. టీడీపీని వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. పర్చూరు ఎమ్మెల్యేతో పాటు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ కూడా.. పార్టీ మారుతున్నరాన్న ప్రచారం జరిగింది. కానీ.. ఆయన వైపు నుంచి ఎలాంటి వివరణ రాలేదు.
ఏలూరి సాంబశివరావు మాత్రం క్లారిటీ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ చాలా తీవ్రంగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోందని.. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయాలన్న లక్ష్యంతో వ్యూహం సిద్దం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో.. టీడీపీ ఎమ్మెల్యేలపై తరచూ పార్టీ మార్పు వార్తలు వస్తున్నాయి. కొంత మంది ఖండిస్తున్నారు.. మరికొంత మంది సైలెంట్‌గా ఉంటున్నారు.