ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేట అనుకున్న విధంగా సాగడం లేదు కానీ.. కొంత మంది ఆశలు రేపుతున్నారు. బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ పతకం తెస్తారనుకుంటే బ్రోంజ్ మెడల్ పోరునూ పరాజయం పాలయ్యారు. స్టార్ ప్లేయర్లంతా నిరాశ పరిచారు. మంగళవారం జరిగిన పోటీల్లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సంచలనం సృష్టించారు. నేరుగా ఫైనల్‌కు అర్హత పొందారు. మొత్తం పాల్గొన్న వారిలో అత్యధిక దూరం విసిరి ఆయన తన కంటే మరొకరు ఫేవరేట్ లేరని తేల్చి చెప్పారు.
ఇక రెజ్లింగ్‌లో వినేష్ ఫోగట్ సంచలనం సృష్టించారు. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ను మట్టి కరిపిస్తూ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన వినేశ్ ఫొగాట్… అదే ఊపుతో క్వార్టర్ ఫైనల్లోనూ విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. సెమీ ఫైనల్ కూడా రాత్రి పది గంటలకు జరగనుంది. క్యూబాకు చెందిన యుస్నీలీస్తో వినేశ్ తలపడనుంది. ఈ బౌట్లో విజయం సాధిస్తే వినేశ్.. చరిత్ర సృష్టించినట్లే. ఇంతవరకూ రెజ్లింగ్ భారత్‌కు స్వర్ణ పతకం రాలేదు. ఆ కొరతను ఈ స్టార్ రెజ్లర్ భర్తీ చేస్తే ఇన్నాళ్లు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కినట్లే.
Also read : ఒలింపిక్స్ : కాంస్యంతో భారత్ బోణీ
వినేష్ ఫోగట్ కు ఈ విజయాలు ప్రత్యేకం. ఎందుకంటే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం దేశం మొత్తం చూసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ లో చక్రం తిప్పే వ్యక్తి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ద్వారా ఎన్నో అవమానాలు, వేధింపులను ఎదుర్కొన్నామని, తమను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ మీడియా ఎదురుగా కన్నీళ్లు పెట్టుకున్నారు. హాకీ సెమీ ఫైనల్లో జర్మనీతో భారత్ రాత్రి పదిన్నరకు తలపడనుంది.