ప్రధానమంత్రి నరేంద్రమోడీ వారం రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ ఖండ్ నుంచి ఢిల్లీకి అనుసంధానం చేసే ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించారు. పదిహేను వేల కేంద్ర నిధులతో నిర్మించిన ఈ రహదారి వల్ల బుందేల్ ఖండ్ జాతకం మారిపోతుందని ప్రచారం చేశారు. ఈ రహదారి వీడియోలు కూడా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇది అమెరికా కాదు.. ఆస్ట్రేలియా కాదు.. దుబాయ్ అంత కంటే కాదు.. మన దేశంలోనే.. మోడీ సర్కార్ బుందేల్ ఖండ్‌లో నిర్మించిన ఎక్స్ ప్రెస్ వే అంటూ ఎలివేషన్లుఇచ్చారు.
వారం రోజుల తర్వాత ఇప్పుడు మరోసారి ఆ రహదారి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ భిన్నమైన కారణంతో. భారీ వర్షాలు రావడంతో ఎక్స్ ప్రెస్ చాలా చోట్ల కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల గొయ్యిలు పడిపోయాయి.దీంతో ఉపయోగించడానికి వీలు లేకుండా పోయింది. వేల కోట్లు పెట్టి నిర్మించిన ఈ రోడ్ దుస్థితి ఇప్పులు అయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అవినీతి అంటే ఇదని ఫోటోలు పెట్టి చూపిస్తున్నారు. సాధారణంగా ఎక్స్ ప్రెస్ వేలు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల్లోనూ దెబ్బతినకుండా స్ట్రాంగ్‌గా నిర్మిస్తారు.
కానీ భయంకరమైన వరదలేమీ రాకుండానే ఆ ఎక్స్ ప్రెస్ వే చాలాచోట్ల దెబ్బతింది. రిపేర్లు చేసి మళ్లీ ఎక్స్ ప్రెస్ వేను వినియోగంలోకి తీసుకు రావొచ్చు కానీ.. అసలు మరక మాత్రం బీజేపీ ప్రభుత్వంపై పడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్వాకం అంటూ విపక్షాలు విమర్శించాడనికి అవకాశం చిక్కింది. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన అనేకఎక్స్ ప్రెస్ వేలు… ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని స్ట్రాంగ్‌గా నిలబడ్డాయని ఫోటోలుపెడుతున్నారు.