‘ఫ్యామిలీ స్టార్’ తరవాత పరశురామ్ సినిమా ఎవరితో అనే విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ‘రెంచ్ రాజు’ అనే కథ పరశురామ్ దగ్గర రెడీగా ఉంది. కార్తీతో ఈ కథని పట్టాలెక్కిద్దామనుకొన్నాడు. కానీ ఇప్పుడు మనసు మారింది. బాలీవుడ్ హీరోల కోసం, వాళ్ల కాల్షీట్ల కోసం అన్వేషణలో పడ్డాడు పరశురామ్. కథానాయిక మృణాల్ ఠాకూర్ ద్వారా… ఓ బాలీవుడ్ సంస్థతో పరశురామ్ కు కాంటాక్ట్ దొరికిందని, ఆ సంస్థతోనే పరశురామ్ ఓ సినిమా చేస్తాడని తెలుస్తోంది.
Read Also :ఇండస్ట్రీపై రేవంత్ అసంతృప్తి – రంగంలోకి చిరంజీవి !
పరశురామ్ ది క్లాస్ టచ్. అయితే.. ఈసారి తను ఓ కల్ట్ కథని రాసుకొన్నాడట. ‘యానిమల్’ స్థాయిలో ఈ సినిమా అవుటాఫ్ ది బాక్స్ ఐడియా అని, పరశురామ్ కొత్తగా ఈ జోనర్ ట్రై చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఒకరిద్దరు బాలీవుడ్ హీరోలతో టచ్లో ఉన్నాడట పరశురామ్. ‘యానిమల్’ హిట్ తరవాత దక్షిణాది దర్శకులపై బాలీవుడ్ హీరోలకు ప్రేమ పెరిగింది. దక్షిణాది నుంచి ముఖ్యంగా తెలుగు నుంచి ఓ దర్శకుడు కథ చెప్పడానికి వచ్చాడంటే ఆసక్తి చూపిస్తున్నారు. పరశురామ్ కథని వినడానికి అక్కడి హీరోలు సిద్ధంగా ఉండడానికి కారణం అదే. ‘ఫ్యామిలీ స్టార్’ రిజల్ట్ ఎలా ఉన్నా, పరశురామ్ తో మరో సినిమా చేయడానికి నిర్మాత దిల్ రాజు కూడా రెడీగానే ఉన్నారు. కాకపోతే.. తెలుగులో హీరోలెవరూ సెట్ కావడం లేదు. అందుకే ఇప్పుడు పరశురామ్ బాలీవుడ్ బాట పట్టాడు.