చంద్రబాబు ఎన్నో నిందలు పడినా శరవేగంగా పూర్తి చేసిన ప్రాజెక్టు పట్టిసీమ. అదే ప్రాజెక్టును బూచిగా చూపి ఎంత ఘోరమైన రాజకీయాలు చేయాలో అంతా చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇప్పుడు ప్రాజెక్టు కష్టిన చంద్రబాబు నష్టపోయారు. కానీ ఆ ప్రాజెక్టును తప్పు పట్టిన జగన్ రెడ్డి సీఎంగా ఉండి.. .. ఉపయోగించుకుని ప్రజాగ్రహం నుంచి కాస్త తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరువు పరిస్థితుల్లో కృష్ణాడెల్టాలో 15 లక్షల ఎకరాలను కాపడటానికి పట్టిసీమ ఉపయోగపడుతోంది.
” పట్టిసీమ నుంచి… వందల కోట్ల కరెంట్ ఖర్చు పెట్టి.. గోదావరి నీళ్లు ఎత్తి పోసి.. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. పట్టి సీమ వల్ల.. ఒక్క రైతుకూ ఉపయోగం లేదు. కేవలం అవినీతి కోసమే ఆ ప్రాజెక్టును నిర్మించారు..” .. అసెంబ్లీతో పాటు.. బయట కూడా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల సారాంశం ఇది. దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి అప్పటి అధికారపక్షం టీడీపీ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంత బలంగా తన వాదన వినిపించారు. ప్రాజెక్ట్‌లో అవినీతి అని ఆరోపించడం ఒక ఎత్తు అయితే.. అసలు ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదని వాదించడం మరో ఎత్తు. వైసీపీ అదే చేసింది.
పట్టిసీమను కట్టి… డెల్టాను కాపాడిన టీడీపీ రాజకీయంగా నష్టపోయింది. కానీ జగన రెడ్డి ఆ పట్టిసీమ నుంచి నీళ్లు వదిలి… డెల్టాను కాపాడామని ఫ్యాక్ట్ చెక్ ద్వారా కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి వివిద సందర్భాల్లో పట్టిసీమ ప్రాజెక్ట్ దండగన్న.. వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి.. నీళ్లు వదిలిన దృశ్యాలను వైరల్ చేస్తున్నారు. దీనికి వైసీపీ సమాధానం చెప్పుకోలేదు.. ఎందుకంటే.. అలాంటిది ఆ పార్టీ బ్లడ్‌లోనే ఉండదు.