చేతిలో అధికారం లేనప్పుడు… జేబులోంచి డబ్బులు తీసి, కౌలు రైతులకు ఇచ్చారు పవన్ కల్యాణ్. సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు కొనసాగించిన అరుదైన రాజకీయ నాయకుడిగా నిలిచారు. ఇప్పుడు చేతిలో అధికారం ఉంది. పార్టీ ఫండ్ ఉంది. అయినా సరే… తన పంథా మార్చలేదు. మళ్లీ పెద్ద మనసు చేసుకొని, తన సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నారు. ఏపీ వరద బాధితుల కోసం ఇప్పటికే రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్, ఇప్పుడు తెలంగాణకు కూడా రూ.కోటి ఇస్తానని ప్రకటించారు. అంతే కాదు. ముంపుకు గురైన 400 గ్రామాల్ని గుర్తించి, ఒక్కో పంచాయితీకి లక్ష రూపాయల చొప్పున అందించడానికి రెడీ అయ్యారు. అంటే… నాలుగు కోట్లన్నమాట. ఇదంతా ఆయన సొంత డబ్బు. పంచాయితీ ఖాతాలో నేరుగా ఈ మొత్తం జమ కానుంది.
మరోవైపు మంత్రిగానూ తన బాధ్యతల్ని సక్రమంగానే నిర్వహిస్తున్నారు పవన్. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. `డిప్యూటీ సీఎం ఎక్కడ? వరద ప్రాంతాల్లో పవన్ పర్యంటించట్లేదు` అంటూ పవన్ పై బురద జల్లాలనుకొంటున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఏం అంటారు? ఎలా స్పందిస్తారు? లక్షల కోట్లు దోచుకొన్న జగన్, ప్యాలస్ పేరుతో ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టిన జగన్… వరద బాధితుల కోసం కోటి రూపాయలు సహాయం ప్రకటిస్తే.. పవన్ గ్రామ పంచాయితీలకే రూ.4 కోట్లు అందించడానికి ముందుకొచ్చారు. ఈ అంకెలు చెప్పడం లేదూ..? ప్రజా నాయకుడికీ, దోపిడీ దారుడికీ ఉన్న తేడా?!