“ఎన్నికలకు ముందే యుద్దం వస్తుందని.. రెండేళ్ల కిందటే బీజేపీ నేతలు తనకు చెప్పారని …” తను చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గారు. అందరూ అనుకుంటున్నదే తాను చెప్పానని కవర్ చేసుకున్నారు. యుద్ధం వస్తుందని… తనకు ఎవరూ చెప్పలేదని… రాజకీయ విశ్లేషకులు, వార్తా చానళ్లకు తెలిసిందే తాను చెప్పానని చెప్పుకొచ్చారు. గత నెల 26న ఆళ్లగడ్డలో బీజేపీపై విమర్శలు చేస్తూ… తనకు రెండేళ్ల కిందటే.. యుద్ధంగా గురించి చెప్పారని చెప్పుకొచ్చారు. ఈ మాటలు నేషనల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. వాటిని పాకిస్తాన్ మీడియా కూడా ఉపయోగించుకుంది. చివరికి బీజేపీ నేతలు కూడా.. ఫైరయ్యారు. జీవీఎల్ నరసింహారావు.. రంగంలోకి దిగి.. పవన్ కల్యాణ్‌తో ఆ మాటలు చంద్రబాబే అనిపించారని విమర్శించారు. అయితే జీవీఎల్ వ్యాఖ్యలకు పవన్ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలపై స్పందన చెప్పలేదు.
అందుకే.. చిత్తూరు జిల్లాలో రాజకీయ యాత్ర చేస్తున్న పవన్ అక్కడ విద్యార్థులతో మాట్లాడిన సందర్భంలో… యుద్ధంగా అందరూ అనుకుంటున్నదే.. చెప్పానని చెప్పుకొచ్చారు. ” యుద్ధం వస్తుందని నాకేం తెలుసు! రెండేళ్ల ముందే నేనెలా చెప్పలగలను? పాకిస్థాన్ వాళ్లు మాట్లాడుకునేది వింటానా ఏంటి? ..” అని వివరణ ఇచ్చారు. మొత్తానికి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు దుమారం రేపిన తర్వాత తాపీగా తన వివరణ ఇచ్చారు. అయితే..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల.. ఆయన క్రెడిబులిటీనే దెబ్బతింటుందని… ఓ సారి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు కట్టుబడి ఉండాలని అంటున్నారు.
విమర్శలు చేసిన తర్వాత అందరూ అనుకుంటున్నవే అన్నానంటే… ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో లోకేష్‌పై అవినీతి ఆరోపణలు చేసి.. అందరూ అనుకుంటున్నవే అన్నానని.. తన దగ్గర ఆధారాల్లేవని చెప్పుకొచ్చారు. ఇప్పుడూ అలాగే కవర్ చేసుకున్నారు.