జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్టీల్ ప్లాంట్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. ఈ ఆదివారం ఒక రోజు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులోఈ దీక్ష చేస్తారు. నాదెండ్ల మనోహర్‌తో పాటు పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ సర్కార్ తీరును జనసేన తప్పు పడుతోంది. ప్రైవేటీకరణ ఆపడానికి ఏం చేయాలో చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
అక్టోబర్ 31వ తేదీన విశాఖలో భారీ బహిరంగసభ పెట్టి విశాఖస్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైసీపీ ఏం చేస్తుందో చెప్పాలని వారం రోజుల డెడ్ లైన్ పెట్టారు. అయితే వైసీపీ నేతలు లైట్ తీసుకున్నారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. డెడ్ లైన్‌పై తర్వాత పవన్ కల్యాణ్ కూడా పట్టించుకోలేదు. విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసి అఖిలపక్షం తరహాలో పోరాటానికి ప్లాన్ చేస్తామని ప్రకటించారు. కానీ పెద్దగా పట్టించుకలేదు
దాదాపుగా నెలన్నర తర్వాత పవన్ కల్యాణ్ మరోసారి స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఈ అంశంపై వైసీపీని విమర్శిస్తున్నాయి. ఇటీవలే రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంతో ఆ తరహాలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా ఆపాలనిడిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం. . తగ్గేది లేదని చెబుతోంది.