సోషల్ మీడియాలో జనసనపై జరుగుతున్న పొత్తుల మైండ్ గేమ్ విషయంలో పవన్ కల్యాణ్ క్యాడర్‌కు స్పష్టమైనసూచనలు చేశారు. తాను చెప్పిన విషయాలను మాత్రమే ప్రజలకు చెప్పాలని.. ఎవరో చేసే ప్రచారాల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలని పవన్ కల్యామ్ ప్రశ్నించారు. తనను కలిసిన పార్టీ నాయకులకు ఇదే చెప్పారు. పార్టీ క్యాడర్ అదే సమాచారం ఇవ్వాలని కూడా దిశానిర్దేశం చేశారు. మనం చేసేది చెబుదాం. పొత్తులు, ఎత్తులపై మనకంటూ ఒక లైన్ ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాజకీయాలు ఒక ఎత్తు, మనం చేసే రాజకీయం మరో ఎత్తని ఇతర పార్టీల ట్రాప్‌లో పడకూడదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చాలా డిఫరెంట్, ఇతర రాజకీయ పార్టీలు వేరు మన జనసేన పార్టీ వేరు, మన మీద కేసులు లేవు. అవినీతి ఆరోపణలు అంత కంటే లేవు. కుంభకోణాలకు ఆస్కారమే లేదు. పూర్తి పారదర్శకంగా పార్టీని నడుపుతున్నాం. ఇవే మన రక్షణ కవచాలు అని నేతలకు పవన్ వివరిస్తున్నారు. కే ఇప్పటి వరకు పరిస్థితులు వేరు, ఇప్పడు పరిస్థితులు వేరు కాబట్టి రాజకీయాల్లో మనం నిలబడాలంటే ముందుగా ఎదుటి వారి ట్రాప్‌లో పడకూడదని పవన్ పదే పదే చెబుతున్నారని ఆయనను కలిసిన నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం.. అనవసరంగా జనసైనికులు జోక్యం చేసుకుంటున్న వైనంపై అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు.
ఎదైనా పార్టీ నుంచి పిలుపు ఉన్నా, రాజకీయ అప్ డేట్ ఉన్నా అధినేతగా తాను ఎదైనా నిర్ణయం తీసుకున్నా ఆ వివరాలు అన్నింటిని అధికారికంగా విడుదల చేస్తామని . వాటినే పరిగణంలోకి తీసుకోవాలని సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో పార్టీ నాయకులను కలిసేందుకు కూడా పవన్ ప్రత్యేకంగా సమయం ిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల షెడ్యూల్స్ పూర్తి కాగానే వారాహి యాత్ర ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సర్వేలు కూడా చేయిస్తున్నానని పవన్ చెబుతున్నారు.