రైతులను ఆదుకునేందుకు ముందుంటానని ఇప్పటికే ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్… చిత్తూరు జిల్లా రైతుల కోసం కర్నాటక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు బెంగళూరు వెళ్లారు.
చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో ఏనుగులు గ్రామాల మీదకు వస్తుంటాయి. దీంతో పంటలు నాశనం అవ్వటంతో పాటు ప్రాణనష్టం కూడా కలుగుతుంది. ఆ ఏనుగులను తరమాలంటే కుంకీ ఏనుగులు అవసరం ఉండటం, ఆ కుంకీ ఏనుగులు కర్నాటక దగ్గరే ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపాలని నిర్ణయించింది.
పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ చొరవ తీసుకొని… కర్నాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖంద్రేతో చర్చల కోసం బెంగళూరు వెళ్లారు.
కొన్నికుంకీ ఏనుగులను ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని, తద్వారా ఇక్కడి రైతులకు ఇబ్బందులు తొలగిపోతాయని ఏపీ సర్కార్ తరఫున పవన్ విజ్ఞప్తి చేయబోతున్నారు.