ఓ కథనం రాసినప్పుడు.. దానికి సంబంధించిన స్పందనలు వస్తే.. తెలియజేయాల్సిన బాధ్యత… సదరు పత్రికపై ఉంటుంది. ఆ కథనంలో ఎలాంటి దురుద్దేశం లేదని… కనీసం.. కవర్ చేసుకోవడానికైనా…ఈ జర్నలిజం ప్రాధమిక సూత్రాన్ని పాటిస్తారు. కానీ సాక్షి దినపత్రిక మాత్రం… జర్నలిజం ప్రమాణాలు అంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లాభం కలిగించే వార్తలు ప్రకటించడం.. ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడం మాత్రమే అని అనుకుంటోంది. ఇష్టం వచ్చినట్లు కథనాలు రాసేసి.. ఆ తర్వాత వాటిని.. ఖండిస్తూ వచ్చే ప్రకటనలు ఇచ్చేందుకు కూడా.. ఆ పార్టీకి.. ఆ పార్టీ పత్రిక అయిన సాక్షికి… చేతులు రావడం లేదు. టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు చర్చలు జరుపుతున్నారని.. సాక్షి పత్రిక.. మొదటి పేజీలో.. ప్రధాన వార్తగా.. శుక్రవారం ప్రచురించింది. పవన్ కల్యాణ్.. ఆ వార్తపై… స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో .. ట్వీట్లు చేసి తన అభిప్రాయాన్ని చెప్పారు.
తను వండి వార్చిన కథనంలో.. ఎవరైతే… ప్రధానంగా ఉన్నారో.. వారి స్పందన తెలిసిన తర్వాత సదరు పత్రిక ఏం చేయాలి..?. కనీస జర్నలిజ ప్రమాణాల ప్రకారం.. దాన్ని కూడా ప్రచురించాలి. ప్రజలకు తెలియచెప్పాలి. వాస్తవానికి అయితే.. ఇలాంటి పని కథనం ప్రచురించడానికి ముందే చేయాలి. కానీ సాక్షి వాటిని ఎప్పుడో మర్చిపోయింది కాబట్టి.. కనీసం కథనం ప్రచురించిన తర్వాత అయినా.. పవన్ కల్యాణ్ స్పందనేమిటో ప్రజలకు తెలియచెప్పాలి. కానీ… అలాంటి పనులేమీ సాక్షి చేయలేదు. అటు టీవీ మీడియాలో కానీ.. ఇటు తనే అచ్చు వేసిన ప్రింట్ మీడియాలో కానీ.. పవన్ కల్యాణ్ స్పందనను.. తెలియచెప్పే ప్రయత్నం చేయలేదు. పవన్ కల్యాణ్…ఇలాంటి ప్రచారాలు ఎన్ని చేసుకున్నా… తన పని తాను చేసుకుంటానని స్పష్టం చేశారు. అదే చేస్తారు కూడా..! కానీ సాక్షి మీడియా దీని ద్వాా పాఠకులకు ఏం చెప్పబోతోంది..?
ట్విట్టర్లో ఐవైఆర్ ఏమన్నారో సాక్షి కళ్లకు కనిపిస్తుంది..! కానీ పవన్ కల్యాణ్ ఏమన్నారో మాత్రం కనిపించదా..?. సాక్షి పాఠకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అవుతారేమో కానీ.. వారు కూడా వాస్తవాలు తెలుసుకోవాలని అనుకోకుండా ఉండరు. ఓ భ్రమలో బతికేయాలని.. సాక్షి వి చెప్పేవి మాత్రమే… తెలుసుకుంటారని అనుకోవడం అవివేకం. నేటి సోషల్ మీడియా జమానాలో.. ప్రతీదీ స్పష్టంగా తెలిసిపోతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా ముసుగులో ఏదేదో రాసేసి.. ఎక్కువ కాలం.. పత్రికను… నడిపేద్దామనుకుంటే.. అది అసాధ్యమే. “వార్త” దినపత్రికు ఏ గతి పట్టిందో.. సాక్షి మేనేజ్మెంట్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో..?