సీఎం జగన్మోహన్ రెడ్డి తాను పేదల కోసం పోరాడుతున్నానంటూ ప్రతి బహిరంగసభలో చెప్పుకోవడాన్ని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పాపం పసివాడు అనే బ్లాక్ అండ్ వైట్ సినిమా పోస్టర్ ను పోస్ట్ చేసి.. ఈ సినిమాను ఎవరైనా జగన్ పెట్టి రీమేక్ చేయాలన్నారు. అ పోస్టర్ ఎడారిలో ఓ చిన్న పిల్లవాడు సూటుకేసు పట్టుకుని నడుచుకుంటూ పోతున్నట్లుగా ఉంది. ఇందులో చిన్న మార్పు చేయాలని.. జగన్ చేతిలో సూట్ కేసు బదులు సూట్ కేసు కంపెనీలు పెట్టాల్సి ఉందున్నారు. తన అక్రమార్జనను మనలాండరింగ్ ద్వారా ఈ సూట్ కేసుల ద్వారా జగన్ పంపుతున్నారని..తాను అమాయకుడిగా నటిస్తున్నరాని జగన్ పరోక్షంగా చెప్పారు.
అవినీతి, అక్రమ సంపాదనతో .. అడ్డగోలుగా సంపాదించింది కాక.. అక్రమ నగదు చలామణి చేస్తూ.. అత్యంత ధనిక సీఎంగా ఉంటూ.. క్లాస్ వార్ అంటూ.. చెప్పుకోవడంపై పవన్ మండిపడ్డారు . కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి .. లాంటి వ్యక్తి జగన్ కాదన్నారు. క్లాస్ వార్ అనే పదాన్ని పలికే అర్హత కూడా జగన్ కు లేదని మండిపడ్డారు. అక్రమ సంపాదన. హింసలతో తెచ్చి పెట్టుకున్న అధికారం నుంచి.. జగన్ నుంచి రాయలసీమ ఏదో ఒక రోజు విముక్తి పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సినిమాకు రాజస్థాన్ ఇసుక ఏడారులు అవసరం అని జగన్ మోహన్ రెడ్డితో చేయాలనుకుంటే అక్కడిదాకా అవసరం లేదన్నారు. ఏపీ నదుల నుంచి తవ్వి తీసిన ఇసుక కలెక్షన్ పాయింట్లలో ఎడారి అంత ఉందని అక్కడే తీసుకోవచ్చన్నారు.
అత్యంత విలాసవతమైన జీవితాన్ని ప్రజాధనంతో గడిపే జగన్.. అందర్నీ పేదవాళ్లను చేసి.. తానే వాళ్లను బతికస్తున్నట్లుగా రేషన్ బియ్యం, పథకాల పేరుతో కొంత డబ్బు ఇచ్చి కవరింగ్ చేసుకుని క్లాస్ వార్ అంటున్నారు. పేదల ను బతికిస్తున్నానని చెప్పుకుంటున్నారు. తాను లేనప్పుడు వాళ్లంతా బతకలేదనే భ్రమను కల్పిస్తున్నారు. జగన్ లేనప్పుడు వారంతా ఎంతో ఆత్మగౌరవంతో బతికేవారు. ఇప్పుడు జగన్ వారందరి ఉపాధి ని దెబ్బకొట్టి ప్రభుత్వం మీద ఆధారపడేలా చేసి.. తాను లేకపోతే పథకాలు రావని బెదిరిస్తున్నారు. దీనికి క్లాస్ వార్ అని పేరు పెట్టుకున్నారని జనం మండిపడుతున్నారు. దీన్నే పవన్ తన ట్వీట్లో వెల్లడించారు.