నసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తారనే విషయం మీద రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ఆమధ్య పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించాడు. అదేవిధంగా ఆ తర్వాత పిఠాపురం సభలో కూడా, అన్నీ కుదిరితే పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించాడు. ఇక ఏలూరు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అక్కడ పార్టీ ఆఫీసు ప్రారంభించిన మొదట్లో వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ఎవరు ఎక్కడనుండి ఎన్నికల్లో పోటీ చేయాలనే విషయాన్ని నిర్ణయించడానికి జనసేన పార్టీ తరఫున ఒక స్క్రీనింగ్ కమిటీ ఇటీవలే ఏర్పాటయింది. ఆ స్క్రీనింగ్ కమిటీ, పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చేస్తే బాగుంటుందని సూచించినట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, జనసేన పార్టీ పెట్టిన మిస్స్డ్ కాల్ ద్వారా పార్టీలో చేరే ప్రోగ్రామ్లో రాష్ట్రంలోనే అత్యధికంగా గాజువాక ప్రాంతం నుండి కార్యకర్తలు నమోదు కావడం, రెండు, గాజువాక ప్రాంతం నుండి పోటీ చేయడం వ్యూహాత్మకంగా పార్టీకి లాభిస్తుందని అంచనా ఉండడం. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా పని చేసిన వాళ్లు అందరూ కూడా ఎక్కువగా రాయలసీమ ప్రాంతం నుండి లేదా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారే తప్పించి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వారు లేరు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి ఉత్తరాంధ్ర ప్రాంత నియోజకవర్గం నుండి పోటీ పడితే, ఆ ప్రభావం ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం మీద చూపుతుంది అన్న అంచనాతో పార్టీ స్క్రీనింగ్ కమిటీ పవన్ కళ్యాణ్ ని గాజువాక నుండి పోటీ చేయమని కోరుతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చేస్తారా లేక ఇంకేదైనా నియోజకవర్గం నుండి పోటీ చేస్తారా అనేది తెలియాలంటే కనీసం మరొక నెల రోజులు వేచి చూడాల్సిందే.