ఖాళీగా ఉంటే ఎవరి చేత అయిన తిట్టించుకోవానే ఉబలాటం కొంత మందికి ఉంటుంది. అలాంటి వారిలో ఏపీ మంత్రులు ముందు ఉంటారని మరోసారి నిరూపించారు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్ కల్యాణ్ .. తాను ఇరవై ఏళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానని పెట్టిన ఓ ఫోటోపై ఆయన వెటకారంగా స్పందించారు. ఇది మార్షల్ ఆర్ట్సా అని ప్రశ్నిస్తూ పవన్ కే ట్యాగ్ చేశారు. దీంతో ఇక పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ?
గుడివాడ అమర్నాథ్ రికార్డింగ్ డాన్స్ వీడియోలను వరుసగా పోస్ట్ చేస్తూ.. అది కాదు మార్షల్ ఆర్ట్స్.. ఇదే అసలైన మార్షల్ ఆర్ట్స్ అంటూ కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. కొంత మంది అసలు ఇంగ్లిష్తో మంత్రి ఆడే మార్షల్ ఆర్ట్స్ ముందు ఎవరి మార్షల్ ఆర్ట్స్ నిలబడలేవంటూ పాత వీడియోలను లింక్ చేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ ఇంగ్లిష్‌లో సరిగ్గా మాట్లాడలేరు. అయినాఓ ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడం గతంలో అభాసుపాలయింది. ఆ వీడియోను తెచ్చి వైరల్ చేస్తున్నారు. ఇక రికార్డింగ్ డాన్సుల్లో ఆయన చేసిన డాన్సులు కూడా వైరల్ అయ్యాయి.
పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా విభేదించవచ్చు. అంత మాత్రాన.. ఆయన చేసే ప్రతీ పనిని వెటకారంగా చూడటం… ఖచ్చితంగా మానసిక స్థితిలోని లోపమే. గుడివాడ అమర్నాథ్తో పాటు అంబటి రాంబాబు ఈ లోపంతో బాధపడుతున్నారు. చీటికి మాటికి పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే పవన్ ఫ్యాన్స్ నుంచి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. తమకేమీ పరువు లేదుకాబట్టి పోయినా పర్వాలేదు.. పవన్ ఓ మాట అంటే.. అదే తమకు జగన్ వద్ద మార్కులు తెచ్చి పెడుతుందన్నట్లుగా వీరి తీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి.