‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో వెలుగులోకి వచ్చింది పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం అనూహ్య విజయం సాధించింది. అందులో పాయల్ చేసిన పాత్ర కూడా కొంచెం సంచలనమే. కథలో ఆమెనే విలన్. తన కోరికని తీర్చుకోవడం కోసం మగాడ్ని వాడుకొని వదిలేసిన క్యారెక్టర్. నిజానికి ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఒక డేరింగ్ స్టెప్. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన అవకాశాల్ని సరిగ్గా వాడుకోలేకపోయింది పాయల్. పైగా ఆమెకు విజయాలు కూడా కలసిరాలేదు.
ఇప్పుడు మరోసారి అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ చేసింది పాయల్. ఈ చిత్రంలో కూడా పాయల్ ది ఓ బోల్డ్ రోల్ అని తెలుస్తోంది. ఇందులో పాయల్ నింఫోమానియాక్ కండీషన్ వున్న పాత్రలో కనిపించనుందట. నింఫోమానియాక్ అంటే.. శృంగార కోరికలను అదుపు చేయలేని స్థితి. ట్రైలర్ లో చూస్తే ఆ ఛాయలు స్పష్టంగా కనిపించాయి. పాయల్ కి విజయాలే కాదు సినిమాలు కూడా తగ్గాయి. ఇలాంటి సమయంలో మరో బోల్డ్ స్టెప్ తీసుకొని ఈ పాత్ర చేస్తోంది. మరి ఈ పాత్రని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో చూడాలి. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.