మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికాలో కాంట్రాక్టులు చేస్తున్నారట.. అందుకని ఇక్కడి తన వాహనాలన్నింటినీ ముంబై పోర్టు నుంచి ఆఫ్రికాకు ఎక్స్ పోర్టు చేసేస్తున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ చేయాలనుకుంటే… ఇక్కడి నుంచే ఎందుకు వాహనాలు తీసుకెళ్లాలి ?. అక్కడే సమకూర్చుకోవచ్చు కదాఅనే డౌట్ సామాన్యలకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వ్యాపారాలకూ అవసరమే కదా .. ఉన్న పళంగా ఇక్కడి వ్యాపారాలను మూసేస్తున్నారా అంటే సమాధానం లేదు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి వైసీపీ నేతలు చాలా వరకూ సర్దుకుంటున్నారు. వైసీపీ సర్కార్ లో పెద్దిరెడ్డి వ్యవహరించిన తీరుతో.. ప్రభుత్వం మారగానే ఆయన వ్యాపారాలన్నీ మూతపడటం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ఆయన వ్యాపారాలన్నీ లొసుగులతో నిండిపోయినవే. కాంట్రాక్టులు.. మైనింగ్ సహా చాలా దందాలున్నాయి. మైనింగ్ మంత్రిగా ఆయన చేసిన అరాచకాల గురించి చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు మీద అంగళ్లలో హత్యాయత్నం చేయించడమే కాదు.. వందల మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి పీలేరులో మంత్రి పెద్దిరెడ్డి మాఫియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా.
అందుకే ముందు జాగ్రత్తగా ఆయన సర్దుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. గత రెండు వారాలుగా ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. ఈ సైలెన్స్ వెనుక అసలు వ్యవహారం తన ఆస్తులు, వ్యాపారాలను మెల్లగా దేశం దాటించేయడం. అదే చేస్తున్నారు. ఆధారాలతో సహా టీడీపీ నేతలు విమర్శలు చేయడంతో మీడియా ముందుకు వచ్చారు. తమ మైనింగ్ వ్యాపారం కోసం ఆఫ్రికా తరలిస్తున్నామని చెప్పుకొచ్చారు. మరి ఇక్కడి వ్యాపారాలపై ఆశల్లేవా అంటే.. ఆయన తడబడుతున్నారు. కొత్తవి కొంటామని చెప్పుకొస్తున్నారు.
పెద్దిరెడ్డి తరహాలోనే చాలా మంది విదేశాలకు వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ అమెరికాలో ల్యాండయ్యారు. కొడాలి నాని చప్పుడు చేయడం లేదు. ఇంకా చాలా మంది అధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్నారు.