మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ రెడ్డి ధిక్కరిస్తున్నారు. అదీ కూడా ఉద్దేశపూర్వకంగా. ఓ అధికారి విషయంలో తన అసంతృప్తి చూపిస్తున్నారు. జగన్ రెడ్డి రాయబారం పంపినా పట్టించుకోవడం లేదు. తాను కూడా రాజీనామా చేస్తానని తన పదవి కూడా ఇవ్వాలని సెటైర్లు వేసి పంపిస్తున్నారు. ఇదంతా వైసీపీలో కొత్త చరిత్రకు కారణం అవుతోంది.
మంత్రి పెద్దిరెడ్డి చేతుల్లో విద్యుత్ శాఖ ఉంది. పద్మా దేవేందర్ రెడ్డి అనే ఓ అధికారి నాలుగేళ్ల కిందట రిటైర్ అయ్యారు. ఆయనను జగన్ రెడ్డి కీలక పోస్టులో నియమించి కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చారు. రెండు సార్లు కొనసాగింపు అయిపోయింది. ఇప్పుడు మూడో సారి కొనసాగింపు ఇచ్చారు. ఆ ఫైల్ పై సంతకం పెట్టాల్సింది జగన్ రెడ్డి కాదు… పెద్దిరెడ్డి. ఆయన పైల్పై… అడ్డంగా రాసేసి.. ఆ అధికారి వద్దని తేల్చేశారు. కానీ కావాల్సిందేనని సజ్జలతో రాయబారం పంపిస్తున్నారు.
ఈ పద్మాదేవేందర్ రెడ్డి ఎవరంటే.. వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడు.. శివశంకర్ రెడ్డి వియ్యంకుడట. శివశంకర్ రెడ్డికి ఎక్కడ కోపం తెప్పిస్తే ఎక్కడ అప్రూవర్ గా మారుతాడనే భయం ఉండనే ఉంది. అయితే పెద్దిరెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన కుటుంబానికి నాలుగు అసెంబ్లీ, ఓ పార్లమెంట్ టిక్కెట్ ను ఆయన ప్రకటించుకున్నారు. అలాగే రోజాకు టిక్కెట్ ఇవ్వొద్దని అంటున్నారు. ఇవన్నీ ఏ మార్పులకు కారణం అవుతాయోనని .. వైసీపీలో చర్చ జరుగుతోంది.