మీరు అధైర్య పడొద్దు… కేసులు పెడితే నేను విడిపిస్తా. మీ ఇల్లు కూల్చితే నేను కొత్తది కట్టిస్తా… నేను మీకు అండగా ఉంటా. ఇది మాజీమంత్రి పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి వైసీపీ క్యాడర్ ను బ్రతిమిలాడుకుంటూ చెప్తున్న మాటలు.
పుంగనూరు అంటే పెద్దిరెడ్డి.. పెద్దిరెడ్డి అంటే పుంగనూరు అన్నట్లుగా ఇన్ని రోజులుగా రాజకీయం నడిపారు. కానీ, ప్రజల ఆస్తులను దోచే వరకు వస్తే ప్రజలు ఊరుకుంటారా…? తిరగబడుతున్నారు. దీనికి టీడీపీ క్యాడర్ కూడా తోడవటంతో పుంగనూరులో కాలు పెట్టాలంటేనే పెద్దిరెడ్డి కుటుంబానికి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది.
కొన్ని రోజుల కింద పెద్దిరెడ్డి పుంగనూరు రావాలంటే పోలీసులు సహయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన కొడుకు, ఎంపీ పరిస్థితి కూడా అంతే. పుంగనూరు వచ్చిన పెద్దిరెడ్డి ఓ మాజీ ఎంపీ ఇంట్లో నుండి బయటకు వెళ్లాలన్న పోలీసులు ఉండాల్సిన దుస్థితి వచ్చింది. పుంగనూరుకు వస్తానంటే పోలీసులు లేకుండా అడుగు పెట్టలేకపోతున్నారు.
తీవ్రమైన ప్రజావ్యతిరేకతకు తోడు వైసీపీ ఘోర ఓటమి తర్వాత వైసీపీ క్యాడర్ పార్టీకి దూరంగా ఉంటుంది. చాలా వరకు టీడీపీ గూటికి చేరిపోగా… మిగిలిన క్యాడర్ రాజకీయంగా దూరంగా ఉంటుంది. దీంతో, క్యాడర్ లేకుండా రాజకీయం ఎలా అనుకున్నట్లున్నారు… నేనున్నా. నన్ను నమ్మండి అంటూ పెద్దిరెడ్డి ఫ్యామిలీ క్యాడర్ తో కాళ్ల బేరానికి వచ్చినట్లు కనపడుతుంది.