తాడేపల్లిగూడెంలో సభ నిర్వహించాలని టీడీపీ, జనసేన నాలుగు రోజుల ముందే నిర్ణయించుకున్నాయి. నాలుగు అంటే నాలుగు రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో సభ నిర్వహించారు. ఇంత వేగంగా సభ నిర్వహించడం… ప్రజల్ని వచ్చేలా చేయడం చిన్న విషయం కాదు. కానీ అది కూటమికి సాధ్యమయింది. తాడేపల్లిగూడెం సభ చూసిన ఎవరికైనా … ప్రజా తీర్పు ముందే నిర్ణయమైపోయిందని అర్థమవుతుంది.
వైఎస్ జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు … ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దాసోహం అంటోంది. ఒక్కో సభకు మూడున్నర వేల ఆర్టీసీ బస్సులను వాడుతున్నారు. ఊళ్ల నుంచి తరలిస్తున్నారు. బస్సుల్లో మద్యాన్ని పంచుతున్నారు. డబ్బులు పంచుతున్నారు. ఇలా చేస్తేనే వస్తున్నారు. లేకపోతే సొంత పార్టీ నేతలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ టీడీపీ , జనసేన మీటింగ్లను చూస్తే.. ఒక్కటంటే ఒక్క ఆర్టీసీ బస్సు లేదు. ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకున్నా ఇవ్వడం లేదు. ఇక ప్రైవేటు వాళ్లు ఎవరైనా ఇస్తే వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో టీడీపీ, జనసేన సభలకు రావాలంటే.. సొంత వాహనాల్లో రావాల్సిందే. సొంతంగా రావాల్సిందే. ఇలా వచ్చే వారే ప్రభంజనంగా కనిపిస్తున్నారు.
మద్యం పోసి..డబ్బులు ఇచ్చి.. బస్సుల్లో తీసుకొచ్చి.. తీసుకెళ్లి విడిచి పెట్టినా … భారీగా ఖర్చు పెట్టుకుని ఎంత పెద్ద సభలు పెట్టినా కార్యకర్తల్లో ఉత్సాహం ఉండదు. ఎందుకటే వారంతా బలవంతంగా వచ్చిన వారు. పట్టపగలు సెల్ ఫోన్ లైట్లు వేయమని అడిగే నాయకత్వం ఉన్న పార్టీ లో వారికిఅంతకు మించిన ఉత్సాహం కనిపించదు. కానీ టీడీపీ, జనసేన కూటమికి వచ్చిన స్పందన వేరు. ఆ జోష్ వేరు. మొత్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న సభలను చూస్తే.. ఎవరికైనా ప్రజా తీర్పునకు అసలైన సిగ్నల్ అర్థమైపోతుంది.