కులాభిమానం అంటే.. సొంత కులాన్ని గౌరవించుకోవడం. ఇతర కులాల్ని నిందించకపోవడం. ఎవరి కులం వారికి గొప్ప. కానీ రాజకీయాలు మాత్రం చాలా తేడాగా ఉంటాయి. రాజకీయ నేతలు ఇంకా తేడాగా ఉంటారు. అధినేతను మెప్పించడానికి సొంత కులంపై విరుచుకుపడటానికి కూడా వెనుకాడరు. వైసీపీ కాపు నేతలు ఈ విషయంలో ఎవరూ ఊహించనంత దిగువశ్రేణిలో కామెంట్లు చేస్తున్నారు.
మంత్రి పదవి తీసేసినా.. . కాపు నాయకుల మీద..కాపుల మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ హైకమాండ్ పేర్ని నానినే ముందు పెడుతుంది. అలా ఆయనతో మరోసారి కామెంట్లు చేయించింది. పవన్ కల్యాణ్ ను అడ్డగాడిద అన్న పేర్ని.. కాపులు ఎవరికీ సీఎం లక్షణాలు లేవని తేల్చేశారు. సమాజాన్ని ప్రభావితం చేసేవారు సీఎం అవుతారని.. కాపుల్లో అలా ప్రభావితం చేస్తున్న వారు ఎవరూ లేరని ఆయన అంటున్నారు. కాపులు సీఎం కావడం అత్యాశ కాదని.. కాపుల కోసమే మాట్లాడేవారు సీఎం కాలేరన్నారు. అలాంటి లక్షణాలు జగన్ కు మాత్రమే ఉన్నాయని.. .. సొంత కులాన్ని కించపర్చుకున్నారు పేర్ని నాని.
గతంలో అంబటి రాంబాబు కూడా కాపు కులంపై దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉమనైజర్ గా విమర్శలు పొందినా….. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు మంత్రి పదవి లభించింది. పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విరుచుకుపడితే… ఆయనపై వ్యక్తిగత దాడి చేయడానికి కాపు నేతల్నే జగన్ రంగంలోకి దింపుతారు. వారు కులాన్ని కూడా తిడతారు. వైసీపీ ఓ కులం నేతల్ని అడ్డం పెట్టుకుని ఆ కులంపై ఇలా కక్ష సాధించడమేమిటన్న ఆశ్చర్యం ఈ కారణాలతోనే అందరిలో వ్యక్తమవుతోంది.