వైసీపీ నేతల ఆర్తనాదాలు పీక్స్ కు చేరుతున్నాయి. ఎంతగా అంటే.. చివరికి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. ఏ ఒక్కరినీ వదలం.. రేపు అనేది లేదనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఎవరిపైన అంటే.. ఇంత కాలం తాము చెప్పినట్లుగా చేసిన అధికారులైనే. సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు కావడం.. వైసీపీ నేతల మాటల్ని ఏ ఒక్కరూ వినకపోవడమే కాదు.. కౌంటింగ్ రోజు అల్లర్లు చేయాలని ప్రయత్నిస్తే బడితే పూజ చేయడానికి ఏ మాత్రం సందేహరించవద్దని స్పష్టమైన ఆదేశాలివ్వడం కూడా దీనికి కారణం. కడపలోనే వైసీపీ కీలక వ్యక్తులుగా చెప్పుకుని పాతిక మంది రౌడీల్ని బహిష్కరించేశారు.
పోలింగ్ రోజువరకూ తమకు అనుకూలంగా ఉంటారనుకున్న అధికారులు పోలింగ్ రోజే రివర్స్ అయ్యారు. అప్పట్నుంచి వైసీపీ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ఇప్పుడు రేపు అనేది లేదనుకుంటున్నారా అని బెదిరించే పరిస్థితికి వచ్చారు. నిజానికి రేపు అనేది ఉంటుందన్న భయంతోనే ఇప్పుడు అధికారులు నిజాయితీగా పని చేస్తున్నారు. వైసీపీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల ప్రకారం పని చేస్తున్నారు. ఇది వైసీపీ నేతలకు నచ్చడం లేదు.
గెలుస్తామన్న నమ్మకం పూర్తి స్థాయిలో కోల్పోయిన వైసీపీ నేతలు.. చివరికి అధికారుల్ని బెదిరించే స్థాయికి దిగజారిపోయారు. వైసీపీ పరిస్థితి పూర్తిగా గతంలో టీడీపీ పరిస్థితినే తలపిస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న ఒక్క అధికారి కూడా టీడీపీ మాట వినలేదు. అప్పుడు ఇలాగే టీడీపీ నేతలు గంతలేశారు. ఇప్పుడు వైసీపీ వంతు .