మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారశైలి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పేర్ని నాని సీనియర్ నేత. మంచి మాటకారి. గతంలో ఆయన ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. వైఎస్ హయాం నుంచి కీలకగానే ఉన్నారు. రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. కానీ ఎప్పుడూ గౌరవం పోగొట్టుకోలేదు.
పేర్ని నాని సొంతంగా ఎదగలేదు. ఆయన రాజకీయ వారసుడిగానే తెరపైకి వచ్చారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మంత్రివర్గంలో పేర్ని కృష్ణమూర్తి అనే మంత్రి ఉండేవారు. ఆయన చనిపోవడంతో ఆయన కుమారుడు పేర్ని వెంకట్రామయ్యకు రాజకీయ భవిష్యత్ లభిచింది. ఆ పేర్ని కృష్ణమూర్తికి మచిలీపట్నం ప్రాంతంలో మంచి పేరు ఉంది. కానీ ఆయన కుమారుడు వెంకట్రామయ్యే ఆ పేరును తుడిచేసేలా వ్యవహరిస్తున్నారు. ఈ వెంకట్రమయ్యేనే ఈ పేర్ని నాని. ఎందుకిలా మాట్లాడుతున్నారో ఆయన అనుచరులకీ అర్థం కాని పరిస్థితి.
పేర్నినానిని మంత్రిని చేశారు. మళ్లీ తీసేశారు. ఆయనకు ఇస్తున్న గౌరవం ఏమీ లేదు. మచిలీపట్నంలో వ్యాపార సహచరుడు .. స్థానికేతరుడు అయిన ఎంపీ బాలశౌరికే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతే కాదు.. మచిలీపట్నంలో పేర్ని కుటుంబాన్ని చులకన చేసేలా ఆయనతో బూతులు తిట్టించేందుకు ప్రోత్సహసిస్తున్నారు. అన్నీ తెలిసి కూడా రెచ్చిపోతున్నారు.
సొంత సామాజికవర్గానికి చెందిన పవన్ పైనే ఇలా ఎందుకు రెచ్చగొడుతున్నారో పేర్ని నానికి తెలియనిదేం కాదు. కులంలో చిచ్చు పెట్టడమే ఆయన బాసుల లక్ష్యం. దానికి పేర్ని నానిని వాడుకుంటున్నారు. ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న నాని.. గతంలో లేని విధంగా మాట్లాడుతున్నారు. పరువు తీుకుంటున్నారు.
కొసమెరుపేమిటంటే.. తండ్రి చనిపోయిన తర్వాత మచిలీపట్నం సీటు పేర్ని నానికి ఇవ్వాలని అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇవ్వాలంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించారు. కానీ నేదురుమల్లి ఆయనకే టిక్కెట్ ఇప్పించారు. కానీ వైఎస్ వర్గీయులు వ్యతిరేకంగా పోటీ చేసి ఓడించారు. ఇదంతా ఆయనకు తెలుసు… తర్వాత వైఎస్ పంచన చేరారు. ఆ కుటుంబానికి పెద్ద పాలేరునని చెప్పుకుని.. చులకన అయిపోతున్నారు. అందుకే .. కాస్త తండ్రి పేరును నిలబెట్టవయ్యా అని మచిలీపట్నంలో అందరూ గుసగుసలాడుకుంటున్నారు.