ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణకు.. నిందితుల వైపు నుంచి మరో ప్రయత్నం జరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా సిట్ ప్రకటించి..విచారణకు రాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసిన తుషార్ వెల్లపల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎం కేసీఆర్ రాజకీయ అజెండా ప్రకారం సిట్ విచారణ చేస్తోందని నిష్పాక్షిక విచారణ కోసం సీబీఐకి ఇవ్వాలని ఆయన అంటున్నారు. తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని.. దాన్ని బయట పెట్టకుండా లుకౌట్ నోటీసలు జారీ చేశారని ఆయన కోర్టుకు ఆధారాలు సమర్పించారు.
కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్, అధికార ప్రతినిధి అనిల్ బలూనీ, క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఓం పాఠక్‌ల బృందం సైతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు కోరుతూ అక్టోబర్ 28న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తుషార్ సైతం సీబీఐకి అప్పగించాలని హైకోర్టుకు వెళ్లారు. గతంలో పలు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయంగా హైప్రోఫైల్ కేసులు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి … సీబీఐ చేతికి చాలా సార్లు వెళ్లాయి.
ఇప్పుడు తుషార్ పిటిషన్ ద్వారా.. హైకోర్టు సానుకూలంగా స్పందిస్తే.. కేసు సీబీఐ చేతిలోకి వెళ్తుంది. అప్పుడు ఇంకా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. నలుగురు ఎమ్మెల్యేలు ప్రధానంగా నిందితులవుతారు. సీన్ రివర్స్ అయిపోతుంది. అందుకే… ఈ కేసు విషయంలో… బీజేపీ … సీబీఐ విచారణ కోసం దండయాత్ర చేస్తోంది. ఆ పార్టీ చేతనైనంతగా చేస్తుందన్నదాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ కేసు తెలంగాణకే పరిమితం కాలేదు. దేశం మొత్తం సిట్ విచారణ చేస్తోంది. సహకరించడం లేదని… హైకోర్టులోనే పిటిషన్లు వేస్తోంది. ఈ కారణంగానే… దేశవ్యాప్తగా అధికారం ఉన్న సీబీఐతో విచారణ చేయించాలన్న వాదనను నిందితులు వినిపింవచ్చు. పొరపాటును కేసు సీబీఐకి వెళ్తే.. సీన్ మారిపోయినట్లే.