అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోవడంతో మరికొద్ది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
కొన్ని వారాల కిందట బ్యారెల్ చమురు ధర 80డాలర్లకు పైగా ఉండగా..ప్రస్తుతం 70-72మధ్య ట్రేడ్ అవుతోంది. 2021 డిసెంబర్ తర్వాత అంటే మూడేళ్ల అనంతరం బ్యారెల్ చమురు ధర 70డాలర్లకు చేరుకుంది. మరికొద్ది రోజులుఅంతర్జాతీయ స్థాయిలో ధరలు ఇలాగే కొనసాగితే ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సూచనాప్రాయంగా తెలిపారు.
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయమని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. జమ్మూ – కశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పెట్రో ధరలు తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా కేంద్రం పెట్రో ధరలు తగ్గించింది అని, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అదే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.