కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టాలని ఆయన అందులో స్ప,్టంచేశారు. పార్టీలోని సీనియర్లు ఎన్నికల్లో నిలబడి గెలిచే పరిస్థితి లేదని ప్రధానంగా పీకే ప్రస్తావించారు. పార్టీని నడుపుతున్న వారిలో అత్యధిక మంది నామినేట్ అయిన వారేనని.. వారికి ప్రజలతో సంబంధం ఉండదని.. ఎన్నికల్లో పోటీ చేయలేరని పేర్కొన్నారు. సీనియర్లను పక్కన పెట్టడంతో పాటు గాంధీయేతర నేతను వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్గా నియమించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ తక్షణం పునరుత్తేజం పొందడానికి 15,000 మంది అట్టడుగు స్థాయి నాయకులను గుర్తించాలని వారిని పార్టీ పనిలో వెంటనే నిమగ్నం చేయాలన్నారు. ఆలాగే భారతదేశం అంతటా 1 కోటి మంది కాంగ్రెస్ సైనికులను క్రియాశీలం చేయాలని కిషోర్ సూచించారు. తటస్థుల నుంచి మద్దతు పొందడానికి ప్రస్తుత పాలకులకు వ్యతిరేకంంగా ప్రచారం చేయడానికి ఒక వేదికను సిద్దం చేసి “ఇండియా డిజర్వ్స్ బెటర్” కింద క్యాంపెయిన్ చేయాలన్నారు. అధికారాన్ని సాధించాలంటే 45 శాతం ఓట్లు ఖచ్చితంగా తెచ్చుకోవాలన్నారు. 30 కోట్ల మంది కాంగ్రెస్కు ఓటు వేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు.
5-6 రాజకీయపార్టీలతో కూడిన కూటమిని ఏర్పాటు చేయాలన్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, తమిళనాడులో డీఎంకే, జార్ఖండ్లో జేఎంఎం, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్, బెంగాల్లో టీఎంసీతో కలిసి పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తే 75-80 శాతం లోక్సభ సీట్లలో గట్టిపోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని పీకే తన నివేదికలో వెల్లడించారు. ఇవన్నీ ఎంత వరకు ఆచరణ సాధ్యమో కానీ చూసే వారికి చాలా బాగున్నట్లుగా అనిపిస్తున్నాయి.