ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు.. రాజకీయ పరంగా… అనేక విమర్శలు వస్తున్నాయి. అందులో ప్రధానంగా.. జగన్ వస్తే.. ఏపీలో… అమరావతిని.. అలాగే.. పోలవరాన్ని నిలిపి వేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అమరావతిపై… జగన్ ఎప్పుడూ నిలకడగా లేరు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తానని చెప్పడం లేదు. మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు కానీ.. తర్వతా దాని గురించి మాట్లాడటం లేదు. అలాగే.. ఇండియా టుడే కాంక్లేవ్‌లో కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేదు. మరి నిజంగానే.. జగన్ వస్తే అమరావతిని నిలిపి వేస్తారా..? పోలవరం ఆపేస్తారా..?
అమరావతి విషయంలో ఇప్పటికీ క్లారిటీగా లేని జగన్..!
అమరావతి విషయంలో.. జగన్మోహన్ రెడ్డిపై.. ఇలాంటి ప్రచారం జరగడానికి ఆయన చేసిన వ్యూహాత్మక తప్పిదాలే కారణం. అమరావతిలో రాజధాని పెట్టవద్దని ఆయన చెప్పలేదు… కానీ.. అక్కడ పంట పొలాలు తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అభ్యంతరాలు అలానే వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. ఆ అభ్యంతరాలతోనే.. అమరావతి విషయంలో.. ఏ ఒక్క వ్యవహారంలోనూ.. ఆయన కల్పించుకోలేదు. చివరికి… శంకుస్థాపనకు కూడా వెళ్లలేదు. శంకుస్థాపనకు వెళ్లిన తర్వాత కూడా.. అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. అయితే.. జగన్ వస్తే .. రాజధాని పక్కన పెడతారా.. అంటే.. చెప్పడం కష్టం. మన దేశంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. మా దగ్గర పెట్టమంటే.. మా దగ్గర పెట్టమని… డిమాండ్లు వచ్చాయి. వస్తాయి కూడా. ఒక్క సారి వేల ఎకరాలు సమీకరించిన తర్వాత.. మరోసారి రాజధానిని మార్చాలనే ప్రయత్నం చేయడం కష్టం. అమరావతిని…ప్రపంచ స్థాయి నగరంగా చేస్తానని అంటున్నారు. బహుశా.. జగన్ వస్తే.. రాజధానిని వికేంద్రీకరిస్తారేమో..? ప్రభుత్వానికి సంబంధించిన విభాగాలు.. కర్నూలులోనో.. విశాఖలోనే కొన్ని పెట్టవచ్చేమో..? ఈ డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది.
అమరావతి పాలనను వికేంద్రీకరిస్తారా..? తరలిస్తారా..?
ఈ విషయంలో వైసీపీ అధినేత.. ఇప్పటికీ క్లారిటీ ఇవ్వకపోవడంతోనే చర్చ జరుగుతోంది. అమరావతి మారుస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో.. వైసీపీ దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుంది. ఆ పార్టీకి చెందిన మేనిఫెస్టో కమిటీ నేతలు… అమరావతిని మార్చబోమని..మేనిఫెస్టోలో పెడతామన్నారు. తాము అవసరానికి మించి భూముల్ని తీసుకోవడానికే వ్యతిరేకమని చెప్పుకొస్తున్నారు. దీని వల్ల.. జగన్ వస్తే.. అమరావతిని మారుస్తారని… అంచనా వేయలేం. అదంతా తేలిక కూడా కాదు. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో.. జగన్ తీరు… అలాగే ఉంది. అయితే.. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే .. అరవై శాతం పూర్తయిందని.. ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి సమయంలో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేస్తారని అనుకోలేం. కాబట్టి వీటిని రాజకీయ విమర్శలుగా భావించవచ్చు. జగన్ కేసీఆర్‌తో.. సన్నిహితంగా ఉంటుంది. పోలవరం ఆపేయాలని తెలంగాణ సర్కార్ .. పిటిషన్లు వేసింది. ఆ మాటకొస్తే.. ఒడిషా కూడా పోలవరానికి వ్యతిరేకంగా ఉంది. అది రాష్ట్రాల మధ్య సమస్యగా ఉంటుంది.
పోలవరం ప్రాజెక్ట్‌ను ఆపేసే పరిస్థితులు రాకపోవచ్చు..!
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి.. ఏపీకి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు. అది… విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్ట్. జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టును నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అయితే.. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. కేసుల నుంచి బయట పడటమే ముఖ్యమని.. టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీకి ఇదో ఆయుధంగా మారింది. కేసీఆర్, జగన్ మధ్య అనుబంధం ఉన్నంత మాత్రాన.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని వదిలేసి.. కేసీఆర్‌తో కలుస్తారా.. అన్నది ఆలోచించాల్సిన విషయం. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల నేతలు.. తమ తమ రాష్ట్ర ప్రయోజనాలకు నిలబడతారు. పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తారని నేను అనుకోను.