ఏపీలో కూటమి సర్కార్ ఉద్యోగ కల్పనకు అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా మెగా డీఎస్సీ వేసిన ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తుండగా, ఇప్పుడు పోలీస్ శాఖలో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియను మొదలుపెట్టబోతుంది.
రాష్ట్రంలో పోలీస్ శాఖలో కొత్త నియామకాలు చేయాల్సి ఉంది. త్వరలోనే కానిస్టేబుల్స్ నియామకాలుంటాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. రాయలసీమ ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, నియామకాలపై ప్రకటన చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంతో పాటు గంజాయి సాగును అరికట్టాల్సిన అవసరం ఉంది. మహిళలపై అఘాయిత్యాలను అదుపులో ఉంచేలా చర్యలు చేపట్టామన్నారు.