ఏపీలో మహిళలపై ఎప్పుడూ జరగనన్ని నేరాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు, హత్యలతో పాటు ప్రేమోన్మాదుల దాడుల్లో కొత్త తరహా నేరాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో ఏకంగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తుపాకీతో ఓ యువతిని కాల్చి చంపి తాను కూడా అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటి వరకూ గ్యాంగ్ వార్లు.. పండిపోయిన క్రిమినల్స్ మాత్రమే ఈ తుపాకీలు .. కాల్పుల గురించి ఆలోచిస్తారు. చివరికి ఏపీకి చెందిన ఓ సాప్ట్ వేర్ కూడా ఓ యువతిని చంపడానికి తుపాకీని తెచ్చేసుకున్నారు
సురేష్ రెడ్డి సాప్ట్ వేర్ ఉద్యోగి. కరోనా టైం నుంచి వర్క్ ఫ్రం చేస్తున్నారు. కావ్య అనే యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కావ్యను పెళ్లి చేసుకోవాలని తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. వారు ఈ వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో కావ్యపై సురేష్ రెడ్డి అక్కసు పెంచుకున్నారు. కావ్యను చంపాలని ప్లాన్ వేశాడు. ముందు అనుకున్నట్లే ఓ తుపాకితో నవ్యను కాల్చిచంపాడు.
అయితే తుపాకీ ఎక్కడిదన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. అది లైసెన్స్డ్ తుపాకీ కాదని పోలీసులు చెబుతున్నారు. అక్రమ పద్దతుల్లో మాఫియా ద్వారా సేకరించి ఉంటారని భావిస్తున్నారు. అయితే అంత ప్రొఫెషనల్‌గా షూట్ చేసి చంపడం.. తర్వాత తనను తాను కాల్చుకోవడం ఎలా సాధ్యమన్న అనుమానం పోలీసుల్లో కూడా వస్తోంది. మొత్తంగా ఏపీలో నేరాల్లో ఇదో కొత్త కోణం. అమ్మాయిలపై వరుసగా జరుగుతున్న నేరాల్లో తుపాకీ కాల్పులు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితికి అద్దం పడుతోంది.