పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాల కు ఆయనను తప్పనిసరిగా అరెస్టు చేయాల్సిందేనని పోలీసులు పట్టుదలగా ఉన్నారు. తమ సీఐపై హత్యాయత్నం చేసి ఆయనపై కుల ముద్ర వేసేందుకు వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయంతో పోలీసులు మరింత పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే యనపై మూడు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వాటిలో అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన ఇంకా పరారీలోనే ఉన్నారు. బయటకు రావడంలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చినా బయటకు రావడం లేదు.
ఇతర కేసుల్లోన ముందస్తు బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్లలో పోలీసుల తరపున వాదనలకు.. వైసీపీ ప్రభుత్వం నియమించిన లాయర్లను పోలీసులు ఉపయోగించుకోలేదు. అదే ప్రభుత్వం నియమించిన లాయర్లు అయితే.. పిన్నెల్లికి అనుకూలంగా వాదించేసి పోలీసుల గాలి తీసేసి ఉండేవారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన పోలీసులు వేరే లాయర్ ను పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు లాయర్ అశ్వనీకుమార్ పోలీసుల తరపున వాదించేందుకు ముందుకు రావడంతో వైసీపీ నేతలు ఖంగుతిన్నారు. వెంటనే డీజీపీపై ఆరోపణలు ప్రారంభించారు.
ఇప్పటి వరకూ వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేసిన పోలీసులు పిన్నెల్లి విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సొంతంగా లాయర్లను ఎంగేజ్ చేసుకుని వాదనలు వినిపిస్తున్నాయి. తాము ఓడిపోకముందే తమను పక్కన పెడుతున్నారని వైసీపీ నేతలకు కోపం వస్తోంది కానీ ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకుంటున్నారు.