సోము వీర్రాజు అల్లుడు కవల వెంకట నరసింహన్ ఓ మిత్రుడ్ని మోసం చేశారు. ఆయనకు తెలియకుండా ఆయన ఆస్తిపత్రాలను ఫోర్జరీ చేసి బ్యాంకులో తనఖా పెట్టారు. ఇప్పుడా మిత్రుడు ఆయనపై పోలీసు కేసు పెట్టారు. ఇప్పుడు అప్పిచ్చిన బ్యాంక్ అధికారులు కూడా సోము వీర్రాజు అల్లుడిపై ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సోమువీర్రాజు అల్లుడు కవల వెంకట నరసింహంకు గద్దె జయరామకృష్ణ స్నేహితుడు. స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్బీఐ బ్యాంకులో లోన్ తీసుకున్నారని జయరామకృష్ణ ఫిర్యాదు చేశారు. పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంకా సోము వీర్రాజు అల్లుడ్ని అరెస్ట్ చేయలేదు.
సహజగంగానే ఈ అంశం సోము వీర్రాజు మెడకు చుట్టుకుంటుంది. రాజకీయం అంటే అంతే. సోము వీర్రాజుపై విమర్శలు ప్రారంభం కాగానే.. ఆయన కుమార్తె సూర్య కుమారి మీడియా ముందుకు వచ్చి డ్యామేజ్ కంట్రోల్ ప్రారంభించారు. తమకు తండ్రికి ెలాంటి రాకపోకలు.., సంబంధాలు లేవని ఆమె ప్రకటించారు. పెళ్లి తర్వాత ఇప్పటి వరకూ సోము వీర్రాజు తమ ఇంటికి రాలేదని ప్రకటించారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే లోన్ తీసుకున్నామని పరిష్కరించుకుంటామన్నారు.
డబ్బు లావాదేవీలకు సంబంధించి మధ్యవర్తుల సమక్షంలో చర్చలు జరుగుతున్నాయని.. మా తండ్రి ప్రతిష్ఠను దెబ్బతీయడానికే మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే రాజకీయం సోము వీర్రాజుకు మరో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్లే.