రాజకీయ నేతలు ఏం మాట్లాడినా దానికో రాజకీయ వ్యూహం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్… ప్రతీ మాటను రాజకీయంగా మాట్లాడతారనే పేరు ఉంది. ప్రస్తుతం.. టీడీపీ, టీఆర్ఎస్ మధ్య వ్యవహారాలు ఉప్పు – నిప్పులా ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ను ఓడించాలని టీడీపీ ప్రయత్నిస్తే… ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్.. ఖమ్మం ఎన్నికల సభలో పట్టిసీమ ప్రస్తావన తెచ్చారు. ఆ ప్రాజెక్టు వల్ల డెల్టా రైతులు బాగుపడ్డారని చెప్పుకొచ్చారు. ఉప్పు-నిప్పులా ఉన్న పరిస్థితుల్లోనూ.. పట్టిసీమపై కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది.
పట్టిసీమ ప్రాజెక్ట్‌కు కేసీఆర్ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు..!
తెలంగాణ ఎన్నికల సమయంలో.. కేసీఆర్.. చంద్రబాబును టార్గెట్ చేసుకుని ముప్పేటదాడి చేశారు. ఇప్పుడు ఆంధ్ర ఎన్నికల సమయంలో… చంద్రబాబు అదే చేస్తున్నారు. కేసీఆర్‌పై ముప్పేట దాడి చేస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ .. పట్టిసీమ ప్రాజెక్టు గురించి పాజిటివ్‌గా మాట్లాడారు. ఓ రకంగా.. పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది… పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం అని… ఏపీ ప్రభుత్వం వాదన. అలాంటిది..ఈ ప్రాజెక్ట్‌పై కేసీఆర్.. సానుకూల స్పందన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పై… కేసీఆర్ .. చాలా రోజులుగా.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంది. పోలవరం వల్ల.. భారీగా.. జీవన విధ్వంసం జరుగుతుందనే…ప్రత్యామ్నాయ డిజైన్ల ద్వారా పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మించాలనేది… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేసీఆర్ వ్యతిరేకించలేదు. ఆ ప్రాజెక్ట్ నుంచి… గోదావరి నీరు 20 టీఎంసీలు.. కృష్ణాకు మళ్లిస్తున్నారు కనుక… తమకు ఎగువన కృష్ణాలో మరో 45 టీఎంసీల నీటి వాటా ఉంటుందని వాదిస్తున్నారు. పట్టిసీమ కట్టుకోవద్దని.. కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదు.
తెలంగాణ గోదావరి నీరు వాడుకోవాలంటే ఎత్తిపోతలే తప్పనిసరి..!
పట్టిసీమ అయినా… సీతారామ ప్రాజెక్ట్ అయినా ఉద్దేశం ఏమిటంటే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నదులు… కృష్ణా, గోదావరి. ఇతర ఉపనదులు… ఉన్నా.. కృష్ణా, గోదావరి ప్రధానమైన నదులు. విచిత్రం ఏణిటంటే… కృష్ణానదిలో నీళ్లు తక్కువ ప్రాజెక్టులు ఎక్కువ. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజ్.. నిర్మిస్తున్న పాలమూరు – రంగారెడ్డి కూడా కృష్ణా నదిపైనే ఉన్నాయి. గోదావరిలో నీళ్లు ఎక్కువ… ప్రాజెక్టులు తక్కువ. గోదావరి విషయంలో భౌగోళికంగా.. కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. తెలంగాణలో చాలా.. దిగువన గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. దీని ద్వారా… గ్రావిటీ ద్వారా గోదావరి నీరును.. తెలంగాణ ఉపయోగించుకోవడం కష్టం. నీళ్లు కింద ఉన్నాయి… భూమి పైన ఉంది. ఎత్తిపోతల తప్ప.. మరో మార్గం లేదు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మిషన్ భగీరథ, కాళేశ్వరం… లాంటి ప్రాజెక్టులకు నిర్వహణ వ్యయమే…రూ. యాభై వేల కోట్లు ఉంటుందని… పదిహేనో ఆర్థిక సంఘానికి కేసీఆర్ నివేదిక కూడా ఇచ్చారు. ప్రతీ ఏటా బడ్జెట్లో రూ. 10వేల కోట్లు వీటికే కేటాయించాలి.
పట్టిసీమ నుంచి వాడుకుంటున్న నీటిలో వాటా కావాలన్న కేసీఆర్..!
గోదావరి నుంచి నీళ్లు వాడుకోవాలంటే… తెలంగాణకు… గ్రావిటీ అవకాశం ఉన్న చోట వాడుకోవాలి. దానికి పెద్దగా స్కోప్ లేదు కాబట్టి.. ఎత్తిపోతల పథకాలను ఎంచుకున్నారు. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్ట్ కూడా.. ఈ తరహా ప్రాజెక్ట్. సీతారామ ప్రాజెక్టు కూడా అంతే. అందుకే.. కేసీఆర్.. రెండింటిని పోల్చి చూపుతూ…. అలాగే పంటలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గతంలోనూ పట్టిసీమ ప్రాజెక్ట్ పై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ… పట్టీసమ నుంచి వాడుకుంటున్న నీటికి సంబంధించిన తమ వాటా కావాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఏదైమైనా ఎన్నికల సమయంలో కేసీఆర.. ఇలా చంద్రబాబు నిర్మించిన ప్రాజెక్ట్‌పై సానుకూలంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది..