కుమారుడికి సికింద్రాబాద్ లోక్‌సభ టిక్కెట్ ఇప్పించుకుని… ఎల్బీ స్టేడియంలో సభ ఏర్పాటు చేసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్… జన సమీకరణ చేయలేక… చేతులెత్తేశారు. కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. అయితే.. జగన్ కు సాయం చేసే విషయంలో ఈ సినిమాటోగ్రఫి మంత్రి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడన్న విమర్శలు గట్టిగానే విమర్శిస్తున్నాయి. ప్రత్యేకంగా టార్గెట్ పెట్టుకుని చోటామోటా .. ఆర్టిస్టులు.. ఎవరు దొరికితే వారిని… వైసీపీలోకిపంపే పనిని.. తలసానినే తలకెత్తుకున్నారని లోటస్ పాండ్‌లో బహిరంగంగానే చెబుతున్నారు. జీన్స్, కళ్లజోడు పెట్టుకుని రాజశేఖర్ జలదీక్షకు వచ్చారు. ఇక ఆయన వైసీపీ కార్యక్రమాల్లో కనిపించాల్సిన అవసరం లేదని జగన్ చెప్పారని కన్నీళ్లు పెట్టుకున్న జీవితారాజశేఖర్ మళ్లీ వెళ్లి వైసీపీలో చేరారు. రాజశేఖర్, జీవిత దంపతులు… హఠాత్తుగా లోటస్ పాండ్‌లో ప్రత్యక్షమైన,…జగన్‌తో వైసీపీ జెండా కప్పించుకోవడం… సినీ పరిశ్రమవర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. జీవిత, రాజశేఖర్‌లు ఇప్పటి వరకూ బీజేపీలో ఉన్నారు. ఆమె 2014లో తెలంగాణ బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆమెకు… 2015లో సెన్సార్ బోర్డు సభ్యురాలిగా బీజేపీ పదవి కూడా ఇచ్చింది. అయితే.. బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశాలు ఆమెకు దక్కలేదు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వాలనుకున్నప్పుడు.. ఓ కమిటీని నియమించింది. ఓ ఏడాది నంది అవార్డుల కమిటీకి.. ఆమె చైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలో.. టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. కానీ.. టీడీపీ నుంచి తమ పార్టీలో చేరాలని ఎవరూ అడగలేదు.
ఆ తర్వాత.. ఆమె.. టీఆర్ఎస్తోనూ సంప్రదింపులు జరిగినట్లు ప్రచారం జరిగింది. ఓ సారి సచివాలయానికి వెళ్లి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. అసలు కారణాలేమిటో బయటకు తెలియలేదు కానీ… హరిత హారంలో మొక్కలు నాటడానికని మీడియాకు చెప్పారు. ఆ ఎపిసోడ్లు అన్నీ అయిపోయాయి. ఎన్నికల హడావుడి ప్రారంభమయి.. చాలా కాలం అయినప్పటికీ.. రాజకీయాల్లో వారి పాత్రేమీ లేకుండా పోయింది. ఈ లోపు అనూహ్యంగా.. వారు… జగన్ తో కండువా కప్పించుకున్నారు. మొదట టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీ.. మళ్లీ బీజేపీ… ఆ తర్వాత వైసీపీ.. ఇలా జీవితారాజశేఖర్ పార్టీలు మారుతున్నారు. ఈ కారణంగా.. వైసీపీలో చేరుతున్నారంటే.. పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోలేదు కానీ.. గతంలో… జగన్ గురించి జీవితారాజశేఖర్ లు చేసిన వ్యాఖ్యలే మళ్లీ తెర మీదకు వచ్చాయి. వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఫీజు దీక్షలు, జలదీక్షల్లాంటివి చేసేవారు. ఆ సమయంలో.. నేతలందర్నీ తీసుకెళ్లేవారు. అలా.. 2011లో విజయవాడలో జలదీక్ష చేసినప్పుడు.. జీవితారాజశేఖర్ ను కూడా పిలిపించారు. వారికి ఇచ్చినటైమ్లో వారు.. స్టేజ్మీకు వెళ్లినప్పుడు… ఎదురుగా ఉన్న జనం… రాజశేఖర్‌కు.. ఈలలతో గోల చేసి స్వాగతం చెప్పారు. అప్పుడు ఆయన పూర్తి స్థాయి మేకప్‌లో ఉన్నారు. అచ్చంగా సినిమా స్టైల్లో జీన్స్, కళ్లజోడు పెట్టుకుని వెళ్లారు. ఆ దీక్ష అయిపోయిన తర్వాత… ఇక జీవితా, రాజశేఖర్ లను.. వైసీపీలో పట్టించుకున్నవారు లేరు.
జీవితారాజశేఖర్లకు బాగా పరిచయం ఉన్న జగన్ సన్నిహితుడు అంబటి రాంబాబు… ఓ సందేశం పంపారు. జీన్స్ , కళ్లజోడు పెట్టుకుని రావడం వల్ల జగన్ ఫీలయ్యారని.. ఇక రాజశేఖర్ సినిమాలు చేసుకుని.. జీవిత మాత్రం…రాజకీయ కార్యక్రమాలకు వస్తే చాలని నేరుగా చెప్పేశారు. ఇది జగన్ స్టైల్లోనే ఉండటంతో.. అప్పట్లో మీడియాతో మాట్లాడి…జీవితా, రాజశేఖర్ ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అదయిన తర్వాత వారిని.. వైసీపీ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం.. ఈ సారి అయినా.. వైసీపీ నేతలు..పార్టీలోకి ఆహ్వానించలేదని.. వేరేవిధంగా ఒత్తిళ్లు రావడం వల్లే.. వైసీపీలో చేరారన్నప్రచారం జరుగుతోంది. అయితే గత అనుభవాలు జీవితారాజశేఖర్లకు బాగా గుర్తున్నాయి. అందుకే.. ఈ సారి జగన్ వద్దకు వెళ్లేటప్పుడు జీన్స్ వేసుకెళ్లలేదు. కళ్ల జోడు కూడా పెట్టకోలేదు…కానీ విజయసాయిరెడ్డి వారిని మీడియా వద్దకు తెచ్చినప్పుడు మాత్రం కళ్లజోడు పెట్టుకునే మాట్లాడారు. మొత్తానికి వైసీపీలో సినీతారల చేరికల మాత్రం.. జోరుగా సాగుతోంది. అంతా తలసాని మహిమ తప్ప ఇంకేమీ లేదంటున్నారు.