ఇటీవల చిత్రసీమపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. “బాలయ్య కోపం, ఆవేశం… ఏదైనా సరే ఒక్క నిమిషమే. ఆయన వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోవాల్సిన పనిలేదు. నేనేనై వాటిని సీరియస్గా తీసుకోవడం లేదు. మీరు కూడా తీసుకోకండి.. “ అంటూ లైట్ తీసుకున్నారు. ఈరోజు సాయింత్రం హైదరాబాద్లో పాత్రికేయులతో మాట్లాడారు పోసాని. ఈ సందర్భంగా బాలయ్య వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి.
”బాలయ్య నిజాయతీ పరుడు. డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ల నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా… ఆ పరపతిని వాడుకోలేదు” అంటూ కితాబిచ్చాడు. అంతలోనే బాలయ్యపై సెటైర్లు కూడా వేశాడు. ”త్వరలోనే ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బాలయ్య కలలు కంటున్నారు. ఆ సీట్లో ఉన్నది మీనాన్న ఎన్టీఆర్ కాదు, జగన్ మోహన్ రెడ్డి. ఆయన వెన్నుపోటు పొడవరు, పొడిపించుకోరు. కాబట్టి ఈ ఐదేళ్లే కాదు.. మరో పదేళ్లు కూడా జగనే ముఖ్యమంత్రి” అన్నారు.