కౌంటింగ్ ముందుగా పోల్టల్ బ్యాలెట్స్ ను స్ట్రాంగ్ రూం నుంచి తెచ్చి కట్టలు కట్టడంతో ప్రారంభమవుతుంది. ప్రతి యాభై ఓట్లను ఓ కట్టగా కడతారు. అయితే ఈ సారి ఈ కట్టలు కట్టే ప్రక్రియను ముందే పూర్తి చేస్తారు. కౌంటింగ్ రోజు ఉదయమే ఓట్ల లెక్కింపుతోనే ప్రారంభించాలనుకుంటున్నారు. కట్టలు కట్టే ప్రక్రియకు సమయం పట్టకుండా ముందే పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అన్ని చోట్లా అమలు చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది.
జూన్ 2వ తేదీన జిల్లా ఎన్నికల పరిశీలకులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిథులు, పార్టీల ఏజెంట్లు, రిటర్నింగ్ అధికారులు, మైక్రో ఆబ్జర్వర్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ బ్యాక్సులను తెరవనున్నారు. యాభై పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చొప్పున కట్టలుగా కడతారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఎన్నికల గోడౌన్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
50 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కట్ట కట్టడం ద్వారా వాటిని వేగంగా లెక్కించవచ్చని జిల్లా ఎన్నికల యంత్రాంగం భావిస్తోంది. ఈ ప్రక్రియ అంతా నియోజకవర్గాల వారీగా జరగనుంది. 50 చొప్పున కట్టలుగా కట్టి.. సంబంధిత నియోజకవర్గాల బ్యాలెట్ బాక్సులలో వేస్తారు. లెక్కింపు రోజున ఈ కట్టలను లెక్కింపు చేపడతారు